twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిద్దార్ధ 'సుకుమారుడు' ఆగిపోయింది

    By Srikanya
    |

    సిద్దార్ధ ఆ మద్య కమిటైన కొత్త చిత్రం సుకుమారుడు ఆగిపోయిందని తెలుస్తోంది. పిల్ల జమీందారు తో హిట్టు కొట్టిన అశోక్ తన తదపరి చిత్రంగా సుకుమాడు అనకున్నారు. అయితే డేట్స్ క్లాష్ రావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కటం లేదని సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ న్యూస్ లేదు. గతంలో సుందరాకాండ వంటి అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీ సౌదామిని క్రియేషన్స్ అధినేత కె.వి.వి. సత్యనారాయణ సమర్పణలో సిద్దార్థ్ హీరోగా ఈ ప్రేమకథాచిత్రం రూపొందనుందని చెప్పారు. యువతరం ప్రేమకథాచిత్రంగా పూర్తి స్థాయి వినోదాత్మకంగా దీనిని నిర్మించనున్నట్లు దర్శకుడు చెప్పారు. హీరోయిన్, ఇతర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. అయితే అవేమీ జరగకముందే ప్రాజెక్టు ఆగిపోయినట్లు చెప్తున్నారు.

    ఇక నాని హీరోగా వచ్చిన పిల్ల జమీందార్ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. గతంలో దర్శకుడు అశోక్ ఫ్లాష్ న్యూస్,ఆకాశరామన్న,ఉషోదయం చిత్రాలు డైరక్ట్ చేసారు. ఆయన తొలి హిట్ పిల్ల జమీందార్. ఫన్,మెసేజ్ కలగలసిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని బాగా ఆకట్టుకుంది. సిద్దార్ధ విషయానికి వస్తే ఆయన లేటెస్ట్ లవ్ ఫెయిల్యూర్ భాక్సాఫీస్ వద్ద యావరేజ్ అయ్యింది. చాలా కాలంగా ఆయన సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ తో కలిసి నందని రెడ్డి డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. సమంత ఆ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.

    English summary
    Siddharth has now decided not to do Sukumurudu as the movie's dates are clashing with another movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X