twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైరా సెట్లో అగ్నిప్రమాదంపై అనుమానాలు.. రాంచరణ్‌ వైపే అందరి చూపు.. వివాదంగా!

    |

    టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సైరా నర్సింహారెడ్డి‌ సెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం సినీ వర్గాలను షాక్ గురి చేసింది. భారీ ఎత్తున్న వేసిన సెట్ మంటల్లో కాలి బూడిద కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే తాజాగా ఆ ప్రమాదంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సెట్‌లో అగ్ని ప్రమాదం గురించి మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. ఈ వివాదం గురించి వివరాల్లోకి వెళితే..

    చిరంజీవి ఫామ్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

    చిరంజీవి ఫామ్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

    సైరా చివరి షెడ్యూల్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. కోటకు సంబంధించిన సెట్‌ను గండిపేటకు సమీపంలోని కోకాపేటలోని మెగాస్టార్ ఫాంహౌస్‌లో నిర్మించారు. కొద్దిరోజులపాటు సెట్‌లో షూటింగ్ జరుగింది. అయితే మే 3వ తేదీ తెల్లవారు జామున అగ్ని ప్రమాదం చోటుచేసుకొన్నది. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకొనే సరికే సెట్ పూర్తిగా మంటల్లో బూడిదైనట్టు సమాచారం.

    రూ.2 కోట్ల మేర నష్టం అంచనా

    రూ.2 కోట్ల మేర నష్టం అంచనా

    సైరా సెట్‌ అగ్నిప్రమాదానికి గురి కావడంపై నిర్మాత, హీరో రాంచరణ్ స్పందించారు. సెట్‌లో ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరం. దేవుడి దయ వల్ల ప్రాణ నష్టం జరుగలేదు. సెట్‌ను పునరుద్దరించి చివరి షెడ్యూల్‌ను పూర్తి చేస్తాం అని రాంచరణ్ ట్వీట్ చేశారు. ప్రాథమికంగా రూ.2 కోట్ల నష్టం వాటిల్లిందనే అంచనాకు వచ్చారు.

    ఇన్సూరెన్స్ కోసమేనని రూమర్లు

    ఇన్సూరెన్స్ కోసమేనని రూమర్లు

    అయితే సైరా సెట్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం సెట్‌ను తగలపెట్టారు. ఇన్సూరెన్స్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలను పొందడానికి సెట్‌ అగ్ని ప్రమాదం గురైందని వాదనను కొందరు వెల్లడిస్తున్నారు.

    సైరా సెట్ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా

    సైరా సెట్ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా

    భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందించేటప్పడు స్క్రిప్టు డిమాండ్ మేరకు సెట్ల నిర్మాణం జరుగుతుంది. షూటింగ్ పూర్తయిన తర్వాత వాటిని ఏదో రకంగా ప్రమాదం జరిగిందని ఇన్సూరెన్స్‌ను పొందుతారు. కానీ సైరా సెట్ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఎందుకంటే ఇంకా అక్కడ షూటింగ్ ఉంది. దాని కోసం మళ్లీ సెట్‌ను పునరుద్దరిస్తున్నారు అని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

    రాంచరణ్ కక్కుర్తి పడుతారా?

    రాంచరణ్ కక్కుర్తి పడుతారా?

    సైరా నర్సింహారెడ్డి చిత్రం సుమారు రూ.300 కోట్లతో తెరకెక్కుతున్నది. అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార, సుదీప్, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. అయితే రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం రాంచరణ్ లాంటి నిర్మాత కక్కుర్తి పడుతారా అనే వాదనను ఓ వర్గం వినిపిస్తున్నది.

    English summary
    Megastar Chiranjeevi’s 151st film ‘Sye Raa Narasimha Reddy getting ready with massive budget of Rs 300 crore. Recenly a fire accident broke out in Chiranjeevi farm house, That causes huge loss of set. On Friday wee hours a massive fire broke out this morning burning out a significant part of the film’s set to ashes which is worth more than Rs 2 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X