X
యముడు

యముడు

Action | Romance | 02 Jul 2010 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

యముడు స్టోరీ

యముడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య, అనూష్క, ప్రకాష్ రాజ్, రాధారవి, నాసర్, వివేక్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరి నిర్వహించారు మరియు నిర్మాత కె ఇ జ్ఞాన్‌ వేల్‌ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ సొంత ఊరైన రాజోలులో నరసింహ (సూర్య) ఓ సబ్ ఇన్సపెక్టర్ గా పనిచేస్తూ తన ఊరి వాళ్ళకు తలలో నాలుకలా ఉంటూంటాడు. పనిలో పనిగా సిటీ నుంచి తాతగారి ఊరికి వచ్చిన కావ్య(అనూష్క)తో ప్రేమలో పడతాడు. మరో ప్రక్క పురుషోత్తం(ప్రకాష్ రాజ్) వైజాగ్ లో పెద్ద దాదా. రియల్ ఎస్టేట్ వ్యాపారాలనుంచి కిడ్నాప్ లదాకా డీల్ చేసే అతను అనుకోని విధంగా ఓ కేసులో ఇరుక్కుని రాజోలు వచ్చి సంతకం పెట్టి వెళ్ళాల్సిన పరిస్ధితి వస్తుంది. ఆ క్రమంలో నరసింహకు అతనికి తగువు అవుతుంది. అది దృష్టిలో పెట్టుకున్న పురుషోత్తం...నరసింహను ప్రమేషన్ ఇప్పించి వైజాగ్ ట్రాన్సఫర్ అయ్యేలా చేసి ఏడ్పించాలనుకుంటాడు. తన ఊరిని వదిలి వెళ్ళటానికి ఇష్టపడని నరసింహా..వైజాగ్ వెళ్ళి పురుషోత్తాన్ని ఎట్లా నాశనం చేసాడు. తను ప్రేమించే అమ్మాయి తండ్రి(నాసర్) ని ఎలా ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడనేది మిగతా కథ.
Read More

యముడు కాస్ట్ & క్రూ

యముడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం హరి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత కె ఇ జ్ఞానవేల్‌రాజా
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

యముడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తమిళ 'సింగం' డబ్బింగ్ వెర్షన్ గా వచ్చిన సూర్య చిత్రం 'యముడు' తెలుగువారికి నచ్చేటట్లే కనపుడుతోంది. 'గజనీ' వచ్చిన నాటినుంచీ తమిళ హీరో సూర్య మన జనానికి లోకల్ హీరోలాగనే కనిపిస్తున్నాడు. దానికి తగ్గట్లే అతని చిత్రాలు మంచి ఓపినింగ్స్ తో ఊహించని క్రేజ్ తో ఇక్కడ విడుదల అవుతున్నాయి. ఇక తాజా చిత్రం యముడుకి తెలుగువారికి బాగా పరిచయం ఉన్న అనూష్క, దేవిశ్రీ ప్రసాద్ పనిచేయటం బాగా కలిసివచ్చిన అంశం. మరో ప్రక్క దర్శకుడు హరి రొటీన్ కథనే తీసుకున్నా పక్కా మాస్ మశాలా ఫార్మెట్ లోకి వెళ్ళి ఎక్కడా ఆపకుండా బోర్ కొట్టకుండా యమ స్పీడుగా లాక్కెళ్ళిపోయాడు. యాక్షన్, లవ్, కామిడీ ఏదీ వదిలిపెట్టకుండా వరసగా సీన్స్ వేసుకుంటూ పంచ్ మీద పంచ్ ఇస్తూ కథనాన్ని పరుగెత్తించాడు.

యముడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

యముడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+