Arrest Rhea In SSR: అందుకే రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలి.. జూన్ 8న భారీ కుట్ర?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఇంకా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మరణం తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా కుంభకోణం బట్టబయలైంది. ఓ వైపు సుశాంత్ సింగ్ మరణంతో డ్రగ్స్ మాఫియా లింక్స్ ఉన్నాయనే విషయం పరోక్షంగా పలువురు ప్రస్తావించడం మరింత వివాదమైంది.

అయితే ప్రతీవారం ఏదో ఒక అంశంపైన సుశాంత్ సింగ్ మరణం సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం తెలిసిందే. అయితే తాజాగా Arrest Rhea In SSR Case అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నది. ఈ కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే..

 సుశాంత్ మరణంపై సీబీఐ దర్యాప్తు

సుశాంత్ మరణంపై సీబీఐ దర్యాప్తు

సుశాంత్ సింగ్ మరణం తర్వాత ప్రియురాలు రియా చక్రవర్తిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుశాంత్ సింగ్ తండ్రి పాట్నాలో చేసిన ఫిర్యాదుతో రియాను విచారించి అరెస్ట్ చేశారు. సుమారు నెల రోజులపాటు జైలులో ఉన్న తర్వాత రియా చక్రవర్తి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత సుశాంత్ మరణం కేసులో వాస్తవాలను బయటకు రప్పించేందుకు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు.

జూన్ 8వ తేదీన దిశా సలియాన్ మరణంతో

జూన్ 8వ తేదీన దిశా సలియాన్ మరణంతో

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఐశ్వర్యరాయ్ లాంటి సినీ సెలబ్రిటీలకు మేనేజర్‌గా వ్యవహరించిన దిశా సలియాన్ అనుమానాస్పద మరణం అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. దిశా సలియాన్ మరణం తర్వాత జూన్ 8వ తేదీన రియా చక్రవర్తి సుశాంత్ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. జూన్ 8వ తేదీన సుశాంత్‌తో గొడవ పడి రియా వెళ్లిపోయారనే విషయం అనేక అనుమానాలకు తావిచ్చింది. అది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుట్రలో భాగంగానే జరిగింది అంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.

అందుకే రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలి

ఇదిలా ఉండగా బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ మరణం కేసులో ప్రధాన నిందితురాలు. డ్రగ్స్ సప్లయిర్‌గా ఉద్దేశపూర్వకంగా సుశాంత్‌కు తెలియకుండా నిషేధిత మాదక ద్రవ్యాలు ఇచ్చారు. అలాంటి వ్యక్తిని బయట ఎలా స్వేచ్ఛగా తిరుగనిస్తున్నారు. తాయిని కాపాడే వ్యక్తి రియా చక్రవర్తినే. కాబట్టి రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల మార్చుకొనేందుకు..

సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల మార్చుకొనేందుకు..

ఇక తాజాగా తన మరణానికి ముందు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన మొబైల్ నంబర్‌ను మార్చుకొనేందుకు ప్రయత్నించారు. ఆ వివరాలకు సంబంధించిన ఛాటింగ్ విషయాలు ప్రముఖ టెలివిజన్ మీడియా బయటపెట్టింది. సుశాంత్ తన బ్యాంక్ అకౌంట్ల వివరాలను, కేవైసీని ఎందుకు మార్చాలని ప్రయత్నించారనే విషయాన్ని బయటపెట్టాలి అంటూ కొందరు నెటిజన్లు కోరుతున్నారు.

Recommended Video

House Arrest Movie Team Funny Chit Chat With Roll Rida

ల్యాప్ టాప్ ఎందుకు తీసుకెళ్లిందంటూ

సుశాంత్ సింగ్ మరణం కేసులో రియా చక్రవర్తి కుట్రదారు. సుశాంత్ మెడికల్ రిపోర్ట్స్, ల్యాప్‌టాప్‌ను ఎందుకు తన వెంట తీసుకెళ్లింది? దిశా సలియాన్ మరణం తర్వాత జూన్ 8వ తేదీన ఎందుకు రియా చక్రవర్తి వెళ్లిపోయింది? అంతకుముందు రియా ఎందుకు వెళ్లలేదు. ఇలాంటి ఎన్నో కారణాలపై ఆమెను సీబీఐ ప్రశ్నించాలి. వెంటనే రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X