Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భరత్ అను నేను ఆఢియో.. మహేష్‌బాబుది సూపర్‌స్టార్ హార్ట్.. దేవీశ్రీ ప్రసాద్
దర్శకుడు కొరటాల శివ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న భరత్ అనే నేను ఆడియో ఆవిష్కరణ సభ ఘనంగా జరుగుతున్నది. ఈ వేడుక కోసం ప్రిన్స్ మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, వంశీ పైడిపెళ్లి, ప్రకాశ్ రాజ్, దేవీ శ్రీ ప్రసాద్, రామజోగయ్యశాస్త్రి, అనిల్ సుంకర, కైరా అద్వానీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవీ శ్రీ ప్రసాద్ మాట్లాడారు.
వచ్చాడయ్యో సామీ.. నింగి అనే పాటతో దేవీ శ్రీ ప్రసాద్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సినిమా అనే పెద్ద రథాన్ని లాగుతున్న ప్రేక్షకు సాములందరికీ వచ్చాడయో సామీ పాట అంకితం. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ హీరో సినిమాకు తారక్ లాంటి స్టార్ హీరో ముఖ్య అతిథిగా రావడం అందమైన విషయం. పాజిటివ్ అంశం.
మహేష్, తారక్ ను కలిపిన కొరటాల శివ గారికి థ్యాంక్స్. శివ గారు సినిమాల్లోనే కాదు.. బయట కూడా మంచి సందేశాన్ని ఇస్తున్నందుకు నిజంగా ఆనందంగా ఉంది. శివ చేసిన నాలుగు సినిమాలకు నన్ను సంగీత దర్శకుడి ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది.
భరత్ అనే నేను సినిమా గురించి కాదు.. ఏదైనా మంచి సినిమా చూసినా లేదా ఏది నచ్చిన వెంటనే స్పందించి ప్రశంసిస్తారు. ఆయనది సూపర్ స్టార్ హార్ట్.. మహేష్ కూడా సూపర్ స్టార్. రంగస్థలం సినిమా పాటల గురించి మహేష్ స్పందించారు. ఈ సినిమా మ్యూజిక్ అద్భుతంగా రావడానికి జోగయ్య శాస్త్రి ఓ కారణం అన్నారు. భరత్ అనే నేను.. హామీ ఇస్తున్నాను పాట బాగా రావడానికి కారణమైన ఉదయ్‌ని అభినందించారు.