twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుప్పకూలిన కోలీవుడ్ ఆశలు: మెహ్రీన్ పార్ట్ మొత్తం తీసేసారట, నిరాశలో హీరోయిన్

    C/O సూర్య తమిళ వెర్షన్ విషయంలో దర్శకుడు సుశీంద్రన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ చిత్రంలో మెహ్రీన్ పార్ట్ నుంచి 20 నిమిషాల మేర సన్నివేశాలకు కోత పెట్టేశాడట అతను.

    |

    Recommended Video

    పాపం..మెహ్రీన్ పార్ట్ మొత్తం తీసేసారట !

    "కృష్ణగాడి వీర ప్రేమ గాథ"తో హిట్టు కొట్టాక ఏడాదిన్నరకు పైగా విరామం తీసుకున్న మెహ్రీన్ కౌర్.. నెల వ్యవధిలో "మహానుభావుడు", 'రాజా ది గ్రేట్' సినిమాలతో పలకరించి హ్యాట్రిక్ హిట్లు పూర్తి చేసింది. సందీప్ కిషన్ సరసన నటించిన "కేరాఫ్ సూర్య" సినిమాతో ఆమె డబుల్ హ్యాట్రిక్‌కు శ్రీకారం చుడుతుందని భావించారు. కానీ పాపం కథ అడ్డం తిరిగింది ..

    సినిమా విడుదల తర్వాత

    సినిమా విడుదల తర్వాత

    సందీప్ కిషన్, మెహ్రీన్ హీరో హీరోయిన్‌లుగా తెలుగు మరియు తమిళ్‌లో ఏకకాలంలో నిర్మితమైన చిత్రం "C/O సూర్య". సుశీంద్రన్ దర్శకుడు. తెలుగు, తమిళంలో నవంబర్ 10న విడుదలైన ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సెన్సేషన్ అవుతోంది. ఇప్పటి వరకు సినిమా విడుదల తర్వాత సినిమాలోని ఏ హీరోయిన్ సీన్స్‌ని పూర్తిగా డిలీట్ చేయలేదు.

    ఆశించిన స్పందన లేదు

    ఆశించిన స్పందన లేదు

    కానీ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సీన్స్ తమిళ వెర్షన్‌లో పూర్తిగా డిలీట్ చేశారని తెలుస్తోంది. కానీ ఈ సినిమాకు ఆశించిన స్పందన కనిపించడం లేదు. తెలుగులో ఈ చిత్రానికి ఓ మోస్తరుగా రివ్యూలు వచ్చాయి. కలెక్షన్లు మాత్రం చాలా నామమాత్రంగా ఉన్నాయి.

    రెస్పాన్స్ బాగానే ఉంది

    రెస్పాన్స్ బాగానే ఉంది

    ఫైనల్‌గా ఈ సినిమా తెలుగులో అయితే మంచి ఫలితాన్నందుకునేలా లేదు. ఐతే ఈ చిత్ర తమిళ వెర్షన్‌కు రెస్పాన్స్ బాగానే ఉంది. ‘కేరాఫ్ సూర్య' తమిళ వెర్షన్‌కు పాజిటివ్ రివ్యూలే వచ్చినప్పటికీ.. చాలామంది హీరోయిన్‌తో ముడిపడ్డ సన్నివేశాల విషయంలో నెగెటివ్‌ కామెంట్సే చేశారు.

     20 నిమిషాల సన్నివేశాల కోత

    20 నిమిషాల సన్నివేశాల కోత

    ప్రేక్షకుల నుంచి కూడా అలాంటి ఫీడ్ బ్యాకే వచ్చింది. దీంతో తమిళ వెర్షన్ విషయంలో దర్శకుడు సుశీంద్రన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ చిత్రంలో మెహ్రీన్ పార్ట్ నుంచి 20 నిమిషాల మేర సన్నివేశాలకు కోత పెట్టేశాడట అతను. ఈ సన్నివేశాలు తొలగించాక చిత్ర నిడివి 1 గంట 50 నిమిషాలకు పరిమితమైంది.

    మెహ్రీన్ రియాక్షన్ ఏమిటీ?

    మెహ్రీన్ రియాక్షన్ ఏమిటీ?

    ఇక ఈ సీన్స్ తొలగించే ముందే హీరోయిన్ మెహరీన్‌కి చిత్ర దర్శకుడు క్షమాపణలు చెప్పారని సమాచారం. మరి దీనిపై మెహ్రీన్ రియాక్షన్ ఏమిటీ అనేది తెలియాల్సి ఉంది. ఒక సినిమా రిలీజ్ తర్వాత ఇలా హీరోయిన్ సీన్స్‌ని తొలగించడం అనేది మాత్రం ఇదే మొదటిసారి కావడం విశేషం.

    క్రిస్ప్ థ్రిల్లర్ లాగా తయారైంది

    క్రిస్ప్ థ్రిల్లర్ లాగా తయారైంది

    దీంతో ఇప్పుడిది క్రిస్ప్ థ్రిల్లర్ లాగా తయారైందట. ఎడిటెడ్ వెర్షన్ ఆల్రెడీ థియేటర్లకు కూడా వెళ్లిపోయింది. ఐతే ఈ సినిమాతో తమిళంలోనూ పాగా వేద్దామని చూసిన మెహ్రీన్ నిరాశకు గురైనట్లు సమాచారం. పాపం మొత్తానికి మెహ్రీన్ ఆశలకు పెద్ద గండి పడినట్టే ఉంది.

    English summary
    The makers of Sundeep Kishan and Mehreen Pirzada-starrer Care of Surya have made a shocking move. In a bid to shorten the film’s runtime and make it an out-and-out racy thriller, director Suseenthiran has deleted at least 20 minutes of footage featuring Mehreen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X