»   »  దీపావళి సందడి: బన్నీ, సమంత, నాని, అల్లరి నరేష్ (ఫోటోస్)

దీపావళి సందడి: బన్నీ, సమంత, నాని, అల్లరి నరేష్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్స్ అంతా దీపావళి పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. మహేష్ బాబు తన పిల్లలు గౌతం, సితార, భార్య నమ్రతతో కలిసి వేడుక జరుపుకున్నారు. సినీ పరిశ్రమలోని తన సన్నిహితులకు దీపావళి బహుమతులు పంపారు.

ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమా నిర్వహిస్తున్న సమంత ఈ సారిదీపావళిని మరింత ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంది. డిజైర్ సొసైటీ పిల్లలతో కలిసి దీపావళి వేడకలో పాల్గొంది. రోజంతా వారితో గడిపి వారి ఆనందంలో పాలు పంచుకుంది.

అల్లు అర్జున్ తన ప్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి దీపావళి వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకలో రానా దగ్గుబాటి కూడా జాయిన్ కావడం గమనార్హం. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలను బన్నీ వైఫ్ స్నేహారెడ్డి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.

ఎప్పుడూ ప్రైవేట్ లైఫ్ స్టైల్ ఇష్టపడే ప్రభాస్ దీపావళి వేడుకను కూడా తన ఫ్యామిలీ మెంబర్స్, కజిన్స్ తో కలిసి జరుపుకున్నారు. రామ్ చరణ్ మాత్రం ప్రస్తుతం తన భార్యతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఈ వేడుకలకు దూరంగానే ఉన్నారు. కాజల్, హన్సిక, లావణ్య త్రిపాఠి, లక్ష్మీ రాయ్ తదితరులు ఉత్సాహంగా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

ఇటీవలే ఓ ఇంటివాడైన అల్లరి నరేష్, భార్య విరూప, స్నేహితులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. నరేష్ ఇంటి వద్ద జరిగిన ఈ వేడుకలో నాని, ఆయన భార్య అంజన తో పాటు త్వరలో పెళ్లికి సిద్దమవుతున్న వరుణ్ సందేశ్, వితిక షేరు కూడా పాలు పంచుకున్నారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...

అల్లు అర్జున్

అల్లు అర్జున్


అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రాండ్ గా దీపావళి వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకలో రానా కూడా జాయిన్ కావడం విశేషం. అల్లు అర్జున్, రానా, అల్లు అరవింద్, అల్లు శిరీష్, స్నేహా రెడ్డి, అల్లు అయాన్, అల్లు వెంకటేష్, వైఫ్ నీలిమ తదితరులను ఫోటోలో చూడొచ్చు.

సమంత

సమంత


హీరోయిన్ సమంత ఈ దీపావళి వేడుకను డిజైర్ సొసైటీ పిల్లలతో కలిసి జరుపుకుంది.

అల్లరి నరేష్-నాని

అల్లరి నరేష్-నాని


అల్లరి నరేష్ తన భార్య విరూపతో కలిసి దీపావళి బాష్ నిర్వహించారు. ఈ వేడుకలో నాని, అంజన, వరుణ్ సందేష్, వితిక షేరు తదితరులు పాల్గొన్నారు.

మహేష్ బాబు

మహేష్ బాబు


కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి మహేష్ బాబు దీపావళి పండగ సెలబ్రేట్ చేసుకున్నారు.

ప్రభాస్

ప్రభాస్


ప్రభాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రైవేట్ గా దీపావళి పండగ జరుపుకున్నారు.

కాజల్

కాజల్


దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను కాజల్ తన ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసింది.

హన్సిక

హన్సిక


హన్సిక తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుక సెలబ్రేట్ చేసుకుంది.

లక్ష్మీ రాయ్

లక్ష్మీ రాయ్


దీపావళి సందర్భంగా లక్ష్మీరాయ్ లక్ష్మీ పూజలోపాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ట్రెడిషనల్ లుక్ ఆకట్టుకుంది.

లావణ్య త్రిపాఠి

లావణ్య త్రిపాఠి


లావణ్య త్రిపాఠి దీపావళి సెలబ్రేషన్స్...

రామ్ చరణ్

రామ్ చరణ్


భార్యతో కలిసి విదేశీ పర్యటనలో ఉండటంతో రామ్ చరణ్ దీపావళి వేడుకలకు దూరం అయ్యారు.

English summary
Tollywood stars celebrated the festival Diwali in style. Mahesh Babu kept the festivities a private affair and spent some quality time with his kids and wife.
Please Wait while comments are loading...