»   » 'రోబో' తెలుగు రైట్స్ ఎవరికీ అమ్మలేదు...కేసు పెడ్తాం

'రోబో' తెలుగు రైట్స్ ఎవరికీ అమ్మలేదు...కేసు పెడ్తాం

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాము ఇంతవరకు 'రోబో' డబ్బింగ్ హక్కులు ఎవరికీ విక్రయించలేదని, చదలవాడపై పోలీసులకు ఫిర్యాదు చేశామని..న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నామని ఓ ప్రకటనలో సన్ పిక్చర్స్ సీఈవో హన్స్‌రాజ్ సక్సేనా మీడియాకు తెలిపి అందరికీ షాక్ ఇచ్చారు. ఎందుకంటే మూడు రోజుల క్రిందట రోబో తెలుగు డబ్బింగ్ హక్కులని తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ అధినేత చదలవాడ శ్రీనివాసరావు రూ. 30 కోట్లకు ఈ హక్కులు దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ కథనం నిరాధారం, వాస్తవదూరం అంటూ సన్ పిక్చర్స్ సీఈవో సక్సేనా ఓ ప్రకటన పంపారు.

అయితే, సన్ పిక్చర్స్‌ తో తాము కుదుర్చుకున్న ఒప్పందం కాపీని, ఆ సంస్థకు చెల్లించిన రూ. 2 కోట్ల డీడీ జిరాక్స్ కాపీని తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ అధినేత చదలవాడ శ్రీనివాసరావు మీడియా కు పంపారు. రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో శంకర్ ప్రతిష్టాత్మకంగా 'రోబో' చిత్రం తెలుగు డబ్బింగ్ హక్కులు పై పెద్ద పోటీ ఏర్పడింది. ఇక త్వరలో ముంబైలో నిర్వహించే హిందీ ఆడియో ఆవిష్కరణ తర్వాతే డబ్బింగ్ హక్కులపై ఓ నిర్ణయం తీసుకుంటామని సక్సేనా వివరించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu