ఆ అనుభవం మరువలేనిది.. ఇదే నా ఆశ్రునివాళి.. జయప్రకాష్ రెడ్డి మృతిపై నాగబాబు, వినాయక్ ఎమోషనల్

తెలుగు చిత్ర సీమలో విలనిజాన్ని కొత్త రంగులు అద్దిన విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి. ఫ్యాక్షన్ సినిమాల్లో భీకరమైన రాక్షసత్వాన్ని చూపించిన జయప్రకాష్.. అంతే స్థాయిలో కడుపుబ్బా నవ్వించేశారు. ఎందరో ప్రేక్షకులని నవ్వించిన జయప్రకాష్.. నేడు శోకసంద్రంలో ముంచారు. గుండెపోటుతో నేటి ఉదయం మరణించారు. ఆయన మృతిపట్ల యావత్ తెలుగు సినీ ప్రపంచం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది.

ఇదే నా అశ్రునివాలి..

నా మనసుకి చెరువైన మిత్రుడు జయ ప్రకాష్ రెడ్డి ఇక లేడు. ఒక ప్రతినాయకుడిగా భయపెట్టి, ఒక నటుడిగా నవ్వించే రెండు వైవిధ్యాలను అవలీలగా చేయగల నైపుణ్యం అతడి సొంతం. తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు మిగిల్చి, ఆకస్మికంగా దూరమైన ఆత్మీయుడికి ఇదే నా ఆశ్రునివాళి అని నాగబాబు ఎమోషనల్ అయ్యాడు.

నాకు తీరని లోటు

నాకు తీరని లోటు

జయప్రకాష్ రెడ్డి గారు లేరు అనగానే షాక్ కి గురయ్యాను. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన కామెడీ టైమింగ్ మరీ ఇష్టం. నా అన్ని సినిమాల్లోనూ ఆయన ఉన్నారు. అలాంటి మంచి వ్యక్తి, మంచి నటుడిని కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిదని వివి వినాయక్ సంతాపాన్ని ప్రకటించాడు.

ఆ అనుభవం మరువలేనిది..

జయప్రకాష్ రెడ్డి గారి అకాల మరణం మన అందరికీ తీరని లోటు. ఎటువంటి పాత్రనైనా ఎంతో హుందాగా, ఎంతో సునాయాసంగా చేయటం ఆయన గొప్పదనం. ఆయన నటించిన "అలెగ్జాండర్" నాటకం చూసిన అనుభవం మరువలేనిది. జయ ప్రకాష్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలి అని సాయి ధరమ్ తేజ్ కోరుకున్నాడు.

తెర వెనుక కూడా..

మనకున్న గొప్ప విలక్షణ నటుల్లో ఒకరైన జయప్రకాష్ రెడ్డి గారు మరణించారన్న వార్త తెలిసిన వెంటనే షాక్ అయ్యాను. ఎంతో కలత చెందాను. తెరపైనే కాకుండా తెర వెనకాల కూడా ఎన్నో నవ్వులు పూయించారు. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాను సర్.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ రాశీ ఖన్నా ఎమోషనల్ అయింది.

Recommended Video

Jaya Prakash Reddy : నటుడు జయ ప్రకాష్ రెడ్డి మరణం.. షాక్ లో సినీ పరిశ్రమ! || Oneindia Telugu

విషాదకరమైన వార్త..

విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించిన శ్రీ జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరు అన్న వార్త విషాదకరం.మేము రాసిన ఎన్నో పాత్రలకు ఆయన అద్భుతమైన అభినయంతో ప్రాణం పోసారు.ఢీ సినిమాలో మాటలు లేని పాత్ర,రెడీ సినిమాలో చిట్టినాయుడు పాత్ర ఎన్నటికీ మరువలేనివి.మహా నటుడికి మా వినమ్ర శ్రద్ధాంజలి అని రచయిత గోపీ మోషన్ ఎమోషనల్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X