Don't Miss!
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మున్నాభాయ్- 3 ’ పై దర్శక,నిర్మాతల ప్రకటన
సంజయ్‌దత్ హీరోగా మున్నాభాయ్ పేరుతో రెండు సినిమాలు తీసి భారీ హిట్లు కొట్టిన రాజ్‌కుమార్ హిరాణి, విధువినోద్ చోప్రా ద్వయం మూడోది తీయడానికి కూడా రెడీగానే ఉంది. దాని నిమిత్తం చాలా కాలంగా స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. అయితే ఊహించని విధంగా ...1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు ఇటీవలే సంజయ్‌కు ఐదేళ్ల శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇతడు ఇదివరకే 18 నెలలు జైల్లో గడిపినందున, మరో మూడున్నరేళ్లు కారాగారవాసం చేయాల్సి ఉంటుంది.
మంచి మనసున్న గూండాగా సంజయ్‌దత్ మున్నాభాయ్ ఎంబీబీఎస్ (2003), లగే రహో మున్నాభాయ్ (2006)లో కనిపించాడు. హీరో అనుచరుడిగా అర్షద్వార్సీ నవ్వించాడు. 'మున్నాభాయ్ వచ్చేదాకా మేం ఎదురుచూస్తాం. మూడోదాంట్లో సంజయ్ తప్పకుండా నటిస్తాడు' అని చోప్రా ప్రకటించాడు. సంజూ ఇది వరకే జైలు జీవితం గడిపాడని, ఎన్నో కష్టనష్టాలు కూడా అనుభవించినందున ప్రభుత్వం అతనికి క్షమాభిక్ష పెట్టాలని కోరారు.
'జైల్లో గడపడం నిజంగా కఠినమైన అనుభవమే. అయితే మళ్లీ అక్కడికి వెళ్లడానికి నేను తయారుగా ఉన్నాను. బయటికి వచ్చాకే నాకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. గత 20 ఏళ్లుగా నన్ను వేధిస్తున్న కోతి (బాధ) నుంచి నాకు విముక్తి దొరుకుతుంది. జైలు నుంచి బయటికి రాగానే నేరుగా మున్నాభాయ్- 3 షూటింగ్సెట్కు వెళ్తాను' అని సంజయ్ చెప్పినమాటలను చోప్రా వివరించారు.
'జైళ్లు మనిషిని సంస్కరించాలి గానీ అతనిపై పగతీర్చుకునేలా ఉండకూడదు. సంజయ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. అతడు ఒక మంచి పౌరుడు' అని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, ఇటీవల విడుదలైన జాలీ ఎల్ఎల్బీ తీసిన సుభాష్ కపూర్ మూడో మున్నాభాయ్‌కు దర్శకత్వం వహిస్తాడు అని తెలిపారు.