»   » మహేష్ బాబు మూవీ: అసలు జరిగింది అదీ అంటూ...క్లారిటీ ఇస్తూ రకుల్ ట్వీట్!

మహేష్ బాబు మూవీ: అసలు జరిగింది అదీ అంటూ...క్లారిటీ ఇస్తూ రకుల్ ట్వీట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో ద్విబాషా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

My finger is not fractured: Rakul preet singh

ఈ సినిమా షూటింగులో యాక్షన్ సీన్లు చేస్తుండగా రకుల్ గాయపడింది. ఆమె వేలుకు ఫ్యాక్చర్ అయినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తన వేలుకు ఫ్యాక్చర్ ఏమీ కాలేదు. కేవలం బెనికింది అంతే. త్వరలోనే సెట్టవుతుంది అని ట్వీట్ చేసింది.

మహేష్ బాబుతో ఆమెకు ఇది తొలి సినిమా. గతంతో రకుల్ కు మహేష్ బాబుతో నటించే అవకాశం వచ్చినా డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడం వల్ల చేయలేక పోయానే అనే అసంతృప్తిగా ఉండేది. అయితే వెంటనే ఆమెకు మరో ఛాన్స్ దొరకడంపై సంతోషంగా ఉంది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాను దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబరు కల్లా షూటింగ్ పూర్తి చేస్తారని, పొంగల్ నాటికి ఇది రిలీజ్ కావచ్చునని అంటున్నారు.

English summary
"Hey guys ! My finger is not fractured, it's a sprain. Should be fine soon. Thanku for all d messages n wishes" Rakul preet singh tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu