»   » మహేష్ '1-నేనొక్కడినే' UK వర్కింగ్ స్టిల్స్

మహేష్ '1-నేనొక్కడినే' UK వర్కింగ్ స్టిల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వచ్చే సంక్రాంతికి మురిపించడానికి మహేష్ ఇప్పుడే రంగం సిద్ధం చేసుకొంటున్నాడు ‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం '1'. నేనొక్కడినే అనేది ఉపశీర్షిక. కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రం టీజర్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం స్టిల్స్ కూడా ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ నే కాక అందరిలోనూ అంచనాలు పెంచుతున్నాయి.

మహేష్ బాబు,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం '1-నేనొక్కడినే' . ఈ చిత్రం తదుపరి దశలోకి ఈ నెల 30 నుంచి ప్రవేశిస్తుంది. ఆ రోజు నుంచి డబ్బింగ్ ప్రారంభమవుతుంది. మొదట క్యారెక్టర్ ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టుల డబ్బింగ్ ఫినిష్ చేసి తర్వాత మహేష్ చేత డబ్బింగ్ చెప్పిస్తారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొత్త అనుభూతికి ప్రేక్షకుడిని గురి చెయ్యాలని దర్శకుడు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమాలో చేజింగ్ సీక్వెన్స్ లు స్పెషల్ గా ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని విధంగా తీస్తున్నారు.

రికార్డులన్నింటినీ మహేష్‌బాబు '1' 'నేనొక్కడినే' చిత్రం టీజర్ అధిగమించింది. ఈ సినిమా తొలి టీజర్.. కృష్ణ పుట్టినరోజైన మే 31న విడుదల కాగా, పలు వెబ్‌సైట్ల ద్వారా అత్యధిక ప్రేక్షకులు చూసిన టీజర్‌గా రికార్డ్‌కి ఎక్కింది. ఈ నెల 9న మహేష్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ చిత్రం రెండో టీజర్‌ని విడుదల చేశారు చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర. ఈ కొత్త టీజర్ కేవలం 3 రోజుల్లోనే పది లక్షల వ్యూస్‌తో సంచలనం సృష్టించింది.

ఈ చిత్రం ఆన్ లొకేషన్ స్టిల్స్..విశేషాలుతో కలిపి స్లైడ్ షో లో...

మరో రికార్డ్

మరో రికార్డ్

యుకెలో షూటింగ్ జరుపుకుంటున్న మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘1'(నేనొక్కడినే) చిత్రం శాటిలైట్ రైట్స్ పరంగా రికార్డ్ నెలకొల్పిందని, షాకిచ్చే రేంజిలో ఈ చిత్రం రైట్స్ అమ్ముడుపోయాయని సమాచారం. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని జెమినీ ఛానెల్ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ ఏ తెలుగు చిత్రానికి రానంత రేటు..ఈ చిత్రానికి పలికినట్లు ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. 1(నేనొక్కడినే) అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ రూ. 12.5 కోట్లకు అమ్ముడు పోయింది. మహేష్ బాబు సినిమాలకు ఫ్యామిలీల ఆదరణ బాగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే టీవిలో మహేష్ సినిమాకు టీఆర్పీ రేటింగ్స్ ఓ రేంజిలో ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే మహేష్ సినిమా అంటే ఛానెల్స్ పోటీ పడతాయి. అందుకే ఈ స్థాయిలో శాటిలైట్ రైట్స్ వచ్చాయి.

తమిళంలోనూ...

తమిళంలోనూ...

సన్ నెట్ వర్క్ కు చెందిన ఈ ఛానెల్... ‘1' (నేనొక్కడినే) తమిళ,మళయాళ డబ్బింగ్ వెర్షన్ రైట్స్ ని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి టీజర్స్ ద్వారా వచ్చిన క్రేజ్ రేటు పెరగటానికి కారణమైందని చెప్తున్నారు. ఇంతకముందు మాటీవీ వారు అత్తారింటికి దారేది చిత్రం శాటిలైట్ రైట్స్ ని రికార్డ్ రేటు కు కొనుగోలు చేసారు. ఈ చిత్రం యూకె, ఐర్లాండ్‌లోని వివిధ లోకేషన్లలో షూటింగ్ జరిగింది.

కొడుకుతో కలిసి...

కొడుకుతో కలిసి...

మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. ఇక్కడ అందుకు సంబంధించిన సీన్లతో పాటు యాక్షన్ సీన్లు, చేజింగ్ సీన్లు చిత్రీకరించారు. దీని తర్వాత ఫైట్ సీన్ల కోసం బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్ చేసారు. స్టైలిష్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2014 జనవరి 10న ప్రేక్షకుల ముందుకురానుంది.

రాక్ స్టార్ గా...

రాక్ స్టార్ గా...

డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది.

మహేష్ సరసన కృతి షానన్

మహేష్ సరసన కృతి షానన్

తెరవెనక,తెర ముందు ఈ చిత్రానికి టాప్ పర్శన్స్ పనిచేస్తున్నారు. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది.ఈ నెలాఖరున సూపర్ స్టార్ మహేష్ బాబు బెంగళూరులో కనిపించనున్నారు. నెలాఖరున బెంగళూరులో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. బ్యాంకాక్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.

నిర్మాతలు మాట్లాడుతూ...

నిర్మాతలు మాట్లాడుతూ...

''యాక్షన్‌ తరహాలో సాగే వైవిధ్యమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేష్‌ బాబు శైలి నటన, సుకుమార్‌ వినూత్నమైన టేకింగ్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం మహేష్‌పై ఫైట్స్ చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 17వరకు బ్యాంకాక్‌లోనే షూటింగ్‌ ఉంటుంది. నెలాఖరున బెంగళూరులో సన్నివేశాల్ని తెరకెక్కిస్తాం. దీంతో సినిమా టాకీ పూర్తవుతుంది. డిసెంబరులో పాటల్ని విడుదల చేస్తాము''అని నిర్మాతలు తెలిపారు.

ఎవరెవరు..

ఎవరెవరు..

సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
Mahesh Babu's Upcoming film One Nenokkadine shooting happend at UK. Here are the latest Exclusive Working stills from the Shooting location at United Kingdom. Nenokkadine in the direction of Sukumar is being canned currently in Bangkok and the schedule will be wrapped in a couple of days more.
Please Wait while comments are loading...