»   » హీరో రామ్ న్యూ మూవీ ‘నేను..శైలజ’(ఫస్ట్ లుక్)

హీరో రామ్ న్యూ మూవీ ‘నేను..శైలజ’(ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘నేను...శైలజ'. కృష్ణ చైతన్య సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. జనవరి 1, 2016లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసారు.

ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా ‘రామ్ మాట్లాడుతూ 55 రోజుల్లో సినిమా పూర్తి చేసతాం. ముందు ఈ సినిమాకు హరికథ అనే టైటిల్ అనుకున్నాం. కానీ చివరకు ‘నేను..శైలజ' అనే టైటిల్ సరిపోతుందని భావించాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో నేను డి.జె. పాత్రలో నటించాను. సాఫ్ట్ గా ఉంటేనే మాస్ కు కనెక్ట్ అయ్యేలా నా క్యారెక్టర్ ఉంటుంది' అన్నారు.

Ram's next movie Nenu Sailaja first look

నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ...‘ఒక అబ్బాయి అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ. సంవత్సర కాలం పాటు స్క్రిప్టు వర్క్ పక్కాగా చేసిన తర్వాతే తెరకెక్కించాం. ఈ నెల 12న ఆడియో రిలీజ్ చేసి, జనవరి 1న సినిమాను రిలీజ్ చేస్తాం. సినిమా అందరికీ నచ్చుతుంది' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...‘నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కథరాసుకున్నాను. మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్. సినిమాలోని ప్రతి సీన్ నిజ జీవితానికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది' అన్నారు.

ఈ సినిమాలో సత్యరాజ్, నరేష్, ప్రిన్స్, విజయ్ కుమార్, రోహిణి, ప్రగతి, కృష్ణ చైతన్య, ప్రదీప్ రావత్, ధన్య బాలకృష్ణ, శ్రీముఖి, హిమజ తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభటల్, అనంత్ శ్రీరామ్, సాగర్, డాన్స్: శంకర్, దినేష్, ప్రేమ్ రక్షిత్, రఘు, ఫైట్స్: పీటర్ హెయిన్స్, హరి దినేష్, ఆర్ట్: ఎఎస్.ప్రకాష్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: సమీర్ రెడ్డి, దేవిశ్రీ ప్రసాద్, అసోసియేట్ ప్రొడ్యూసర్: కృష్ణ చైతన్య, నిర్మాత: స్రవంతి రవికిషోర్. రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల.

English summary
Tollywood actor Ram's next movie "Nenu Sailaja" first look poster released.
Please Wait while comments are loading...