For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RGV's Konda: కొండా బడ్జెట్ ఎంత? రాం గోపాల్ వర్మ రెమ్యునరేషన్ ఎంతంటే?

  |

  తెలంగాణలోని వరంగల్ జిల్లా రాజకీయాలను తమ కనుసన్నల్లో నడిపించిన కొండా మురళీ, సురేఖ దంపతుల జీవిత కథ వెండితెరపైన ఆవిష్కరించేందుకు అంతా సిద్దమైంది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కొండా పేరుతో ఓ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు. అక్టోబర్ 12వ తేదీన కొండా మురళి స్వగ్రామం వంచనగిరిలో కొండా మూవీ ప్రారంభవేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ...

  కొండా కథ కోసం మురళి వెనుక పడ్డా

  కొండా కథ కోసం మురళి వెనుక పడ్డా

  కొండా సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాలి. కొండా సురేఖ కోసం ఆమె వెనుక కొండా మురళి ఎలా తిరిగారో.. కొండా కథ కోసం నేను అలా తిరగాను. హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. విజయవాడలో చదువుకొన్నాను. రామానాయుడు స్టూడియో వద్ద జరిగిన బాంబు పేలుడు తర్వాత ఫాక్షనిజం మీద సినిమా తీశాను. అయితే తెలంగాణ గురించి పెద్దగా తెలియదు. అయితే ఇటీవల కొందరు వ్యక్తులను కలిసినప్పుడు తెలంగాణ గురించి కొన్ని తెలుసుకొన్నాను. ఓ జర్నలిస్టును కలిసి కొండా మురళి గురించి అడిగితే.. మామూలోడు కాదు అంటూ చెప్పారు అని ఆర్జీవి తెలిపారు.

  దమ్మున్న మగాడు రాంగోపాల్ వర్మ

  దమ్మున్న మగాడు రాంగోపాల్ వర్మ

  ఎక్కడైన ఒక మనిషి ప్రత్యేక పరిస్థితుల మధ్య పుడతాడు. అక్కడ ఉండే పరిస్థితులు ఆ మనిషిపై ప్రభావం చూపించడం వల్ల.. మంచి కోసం లేదా మరో విషయం కోసం వాళ్లకు ఉన్న ధైర్యంతో ఎదురు తిరగుతారు. అలా ఎదురు తిరిగే మనస్తత్వం కొందరికే ఉంటుంది. ఎదురు తిరిగే మనస్తత్వం లేని కొందరు బానిసలుగా మారిపోతారు. నా జీవితంలో ఇప్పటి వరకు నేను విన్న కథల తర్వాత మహా దమ్మున మగాడు కొండా మురళి అని రాంగోపాల్ వర్మ అన్నారు.

  కొండా మురళి కథ దొరకడం అదృష్టంగా

  కొండా మురళి కథ దొరకడం అదృష్టంగా

  నేను బేసిక్‌గా ఫిల్మ్ మేకర్‌ను. ఒక మనిషి జీవితం గురించి ఎవరో చెప్పిన విషయాలను విని.. దాని నుంచి నేను అర్దం చేసుకొని సినిమా తీయడమనేది నా బాధ్యత. నాకు కొండా మురళి జీవిత కథ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కథ ఎంత ఫెంటాస్టిక్‌గా ఉంటేనే మంచి సినిమా వస్తుంది. కథ లేకపోతే సినిమా రాదు నా జీవిత చరిత్రలో విన్న అద్భుతమైన కథ కొండా మురళి, కొండా మురళి సురేఖ కథ. నా టెలెంట్‌లో పదిశాతం పెట్టినా కొండా సినిమా కనివిని మూవీ అవుతుందని చెప్పగలను అని వర్మ తెలిపారు.

  కొండా సురేఖ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా

  కొండా సురేఖ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా

  ఫైనల్‌గా ఒక మాట చెప్పాలని అనుకొంటున్నా. కొండా సినిమా మొదలుపెట్టాలని అనుకొన్న తర్వాత సురేఖమ్మకు కాంపిటీషన్‌‌గా మారాను. ఎందుకంటే కొండా మురళితో ట్రావెల్ అయిన తర్వాత సురేఖ కంటే ఎక్కువగా ప్రేమలో పడ్డాను. సురేఖ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ను బట్టి చూస్తే.. వారిద్దరు విభిన్నమైన ఫ్యామిలీ. అందుకు నా సెల్యూట్. కొండా సినిమా కేవలం తెలంగాణకు పరిమితం కాదు. సినిమా చరిత్రలో కనివిని ఎరుగని సినిమా అవుతుంది అని రాంగోపాల్ వర్మ అన్నారు.

  Director Maruthi Launched 'Achamaina Telugu Inti Pillave' Song From Savitri w/o Satyamurthy
  కొండా బడ్జెట్, రెమ్యునరేషన్ ఇలా

  కొండా బడ్జెట్, రెమ్యునరేషన్ ఇలా

  ఇక కొండా సినిమా బడ్జెట్, రాంగోపాల్ వర్మ రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. ఈ సినిమాను సుమారు 15 కోట్ల రూపాయలతో రూపొందిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమాకు రాంగోపాల్ వర్మ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని, రూ.15 కోట్ల ప్యాకెజీలోనే సినిమా చేసి పెట్టాలనే ఒప్పందం జరిగిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కొండా కథ, నటీనటులు ఎంపిక విషయానికి వస్తే.. ఈ సినిమా భారీ బడ్జెట్‌తోనే రూపొందుతున్నట్టు చెప్పుకోవచ్చు.

  English summary
  Konda Movie Opening: Ram Gopal Varma performed puja with alcohol to maisamma goddess. RGV Tweeted that I thank the police for not giving permission to our KONDA movie RALLY thereby giving us more publicity. Here is details of Konda Budget, and Remuneration.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X