twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్ సందేశ్ సినిమాపై షారూఖ్ ఖాన్ కేసు

    By Srikanya
    |

    బాలీవుడ్ దృష్టి ఎన్నడూ లేనంతగా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమపై ఉంది. ఇక్కడ ఏం జరుగుతున్నా వారు చాలా జాగ్రత్తగా పరిశీలించి స్టెప్స్ తీసుకుంటున్నారు. రీమేక్స్ రైట్స్ కొనుక్కోవటం దగ్గర నుంచి ఇక్కడ జరిగే టైటిల్స్ వ్యవహారాలు వరకూ వారు పరిశీలిస్తున్నారు. తాజాగా షారూఖ్ ఖాన్ కన్ను ఓ తెలుగు సినిమాపై పడిందని,అయితే అది పాజిటివ్ గా కాదని తెలుస్తోంది.

    వరుణ్ సందేశ్ హీరోగా నీలకంఠ దర్శకత్వంలో డిఎస్ రావు నిర్మిస్తున్న చిత్రం టైటిల్ పై ఆయన కన్ను పడిందని తెలుస్తోంది. ఈ చిత్రానికి చెమ్మకు చల్లో అనే టైటిల్ ని పెట్టారు. అయితే చెమ్మకు చెల్లో అనేది షారూఖ్ చిత్రం రా.వన్ లోని పాట చరణంలోది కావటం ఇక్కడ సమస్యకు కారణమైంది. ఇంతకు ముందే మిస్టర్ నోకియా టైటిల్ తో నోకియా కంపెనీతో వివాదం తెచ్చుకుని టైటిల్ మార్చుకున్న డి.ఎస్ రావు మరో సారి టైటిల్ మార్చనున్నారా అనేది సిని వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    ఈ విషయమై డి.ఎస్ రావు ని మీడియా కలిసినప్పుడు మాట్లాడుతూ...మాకు ఇప్పటివరకూ షారూఖ్ ఖాన్ కంపెనీ నుంచి ఏ విధమైన నోటీసులు అందలేదు. అయినా ఈ టైటిల్ ని నేషనల్ అవార్డు గ్రహీత నీలకంఠ పెట్టారు. ఆయన అన్నీ ఆలోచించే పెడతారు. చమ్మక చల్లో అంటే నెరజాణ అని అర్దం. అయినా ఈ సారి మేము ఛాన్స్ తీసుకోదలచుకోలేదు. షారూఖ్ సంస్ధ నుంచి అడిగితే మేము వేరే టైటిల్ పెడతాం కానీ లక్షలు కొలదీ డబ్బు ఖర్చు పెట్టడానికి సిద్దంగా లేము అన్నారు.

    రీసెంట్ గా గబ్బర్ సింగ్ దర్శకుడు గణేష్ బాబు..తమ చిత్రం టైటిల్ కోసం పాతిక లక్షలు..షోలే నిర్మాతలకు చెల్లించామని తెలిపిన సంగతి తెలిసిందే. ఇక చమ్మక్ చల్లో చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తైంది. షారూఖ్ ఖాన్ ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం ఫారిన్ లో ఉన్నారు. ఆయన ముంబై తిరిగి రాగానే నోటీస్ పంపించే అవకాసం ఉందని తెలుస్తోంది.

    English summary
    Varun Sandesh's next film Chammak Challo, drawing Ra.One star Shahrukh Khan’s attention. It is learnt that Rao has received a notice from Red Chillies Entertainment over the use of Chammak Challo, which is a popular song from Ra.One. A PR executive close Shahrukh Khan, claimed that SRK and his firm would take a call once the star returns from his foreign trip.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X