Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘శమంతకమణి’ టీజర్ సూపర్బ్... (వీడియో)
-నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్ కిషన్, ఆది హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం శమంతకమణి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది.
హైదరాబాద్: నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్ కిషన్, ఆది హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం శమంతకమణి. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్ కిషన్, ఆది ఈ చిత్రంలో డిఫరెంటుగా కనిపించబోతున్నారు.
ఈ సినిమాలో నలుగురు హీరోలకు ప్రామినెంట్ రోల్ ఉంటుందని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని దర్శకుడు శ్రీరామ్ కథను రాసుకున్నాడట. ఓ వైపు వినోదాన్ని పంచుతూనే మరో వైపు ఉత్కంఠ రేకెత్తించే విధంగా సినిమా స్క్రీన్ ప్లే ఉంటుందట.
ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డా.రాజేంద్రప్రసాద్, చాందినీ చౌదరి, జెన్నీ హనీ, అనన్యా, సోనీ, ఇంద్రజ, కస్తూరి, సుమన్, తనికెళ్ల భరణి, హేమ, సురేఖావాణి, సత్యం రాజేశ్, బెనర్జీ, అదుర్స్ రఘు తదితరులు ఇతర పాత్రధారుల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కెమెరా: సమీర్ రెడ్డి, ఆర్ట్: వివేక్ అన్నామలై, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాత: వి.ఆనందప్రసాద్, కథ - స్క్రీన్‌ప్లే - మాటలు - దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.