»   » విశాల్‌తో రొమాన్స్‌కు కమిటైన శృతి హాసన్

విశాల్‌తో రొమాన్స్‌కు కమిటైన శృతి హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ధనుష్‌, శృతి హాసన్ కలిసి నటించిన తమిళ చిత్రం '3' బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డ సంగతి తెలిసిందే. ఈ సినిమా పరాజయం తర్వాత శృతి హాసన్ మళ్లీ ఏ తమిళ సినిమాలోనూ నటించలేదు. ఆ తర్వాత ఆమె పలు తెలుగు, హిందీ చిత్రాలతో బిజీ అయిపోయింది. సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

చాలా కాలం తర్వాత మళ్లీ వృతి హాసన్ తమిళ చిత్రంలో నటించడానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నై సినీ సర్కిల్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటించడానికి శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హరి ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. 2014 ఏప్రిల్ నెలలో ఈచిత్రం అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన వివరాలపై స్పందించేందుకు శృతి హాసన్ నిరాకరించింది. ప్రస్తుతం తాను తెలుగుతో తెరకెక్కుతున్న 'రేస్ గుర్రం' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నానని, ఈ చిత్రం చివరి దశలో ఉందని ఆమె చెప్పుకొచ్చారు. తన తర్వాతి ప్రాజెక్టుల విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని శృతి హాసన్ తెలిపింది.

శృతి ఇతర సినిమాల వివరాల్లోకి వెళితే....వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్‌కు జోడీగా నటించిన చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో 'రేసు గుర్రం'తో పాటు, హిందీలో గబ్బర్, వెల్‌కం బ్యాక్ చిత్రాల్లో నటిస్తోంది.

English summary
Shruti Haasan is reportedly going to make her comeback in Tamil cinema after a long gap, as per the latest reports in Kollywood. The latest buzz in the industry is that Shruti Haasan, who has her hands full in Tollywood and Bollywood, is all set to pair up with Vishal in a film to be directed by Hari.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu