Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీరెడ్డిపై సినీ ఫైనాన్సియర్ ఎటాక్: సీసీ టీవీ పుటేజ్ రిలీజ్, దాడికి కారణం ఇదే!
సుబ్రమణ్యం అనే సినీ ఫైనాన్సియర్ అర్ధరాత్రి చెన్నైలోని తన ఇంటికి వచ్చి దాడికి పాల్పడినట్లు, తనను చంపడానికి ప్రయత్నించినట్లు శ్రీరెడ్డి చెన్నై పోలీసులకు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ఆమె సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
సుబ్రమణ్యం కొందరు మనుషులతో కలిసి రాత్రి పూట తన ఇంట్లోకి బలవంతంగా చొరబడిన సీసీ టీవీ ఫుటేజీ శ్రీరెడ్డి రిలీజ్ చేశారు. తన మేనేజర్ మోహన్ మీద దాడి చేశారని, తనను చంపడానికి ప్రయత్నించడంతో వెంటనే బెడ్రూంలోకి వెళ్లి లాక్ చేసుకున్నట్లు ఆమె తెలిపారు.
నన్ను చంపడానికి ప్లాన్ చేశారు
వారు మా ఇంట్లోకి వచ్చే ముందు... చుట్టపక్కల ఇళ్లు ఎంత దూరంలో ఉన్నాయి? అరిస్తే వినిపిస్తుందా? విషయం పరిశీలించారు. అనంతరం గేట్ లాక్ చేసి లోనికి చొరబడ్డారు. లోనికి వచ్చిన వెంటనే సీసీ కెమెరాలన్నీ ఆఫ్ చేశారు. నన్ను చంపడానికి ప్లాన్ చేశారు కాబట్టే ఇదంతా చేశారని శ్రీరెడ్డి ఆరోపించారు.
కాంప్రమైజ్ కాలేదు
తమిళ మీడియా ఇప్పటికైనా తనను నమ్మాలని, ఈ కేసులో కాంప్రమైజ్ కాలేదని శ్రీరెడ్డి తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తర్వాత కూడా అక్కడ కొందరు పెద్ద మనుషులు బ్లాక్మెయిల్ చేశారని, అర్దరాత్రి దాటిన తర్వాత 3.30 గంటలకు కంప్లయింట్ ఇస్తే కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయలేదని... దాన్ని బట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. నేను ఒంటరి మహిళను, ఎవరి సహాయం లేదు. కానీ ధైర్యం ఉంది. వారికి భయపడితే ఈ వీడియో ఫుటేజీ రిలీజ్ చేసేదాన్ని కాదు కదా అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.
ఒక్కొక్కరుగా ఇంట్లోకి చొరబడుతున్న వీడియో
దాడి చేయడానికి సుబ్రమణ్యంతో పాటు మరికొందరు నా ఇంట్లోకి చొరబడ్డారు. అతడు పోలీసుల ముందు ‘తాగి ఉండటం వల్లే దాడి చేశాను అనిచెప్పాడు. కానీ ఈ వీడియోలో చూస్తుంటే అలా లేదు' అంటూ వీడియో ప్రూఫ్ చూపించే ప్రయత్నం చేశారు శ్రీరెడ్డి.
ఆడియో సాక్ష్యం
సీసీ కెమెరాలు ఆఫ్ చేసిన తర్వాత నేను దాక్కున్న బెడ్రూం డోర్ తెరవడానికి ప్రయత్నించారు. నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. వారు 30 నిమిషాల్లో అక్కడికి చేరుకుని వారిని అరెస్ట్ చేశారు అని శ్రీరెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లో ఫైనాన్స్ స్కామ్
సుబ్రమణ్యం అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఫైనాన్స్ స్కామ్ చేశాడు. మాదాపూర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి 4 నెలలు జైల్లో పెట్టారు. 15 రోజుల క్రితమే చంచల్ గూడ జైలు నుంచి నేరుగా చెన్నై వచ్చాడు. నేను నటిస్తున్న ‘రెడ్డి డైరీ'కి ఫైనాన్స్ చేస్తుంది కూడా అతడే. అందుకే తెలంగాణ పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మమ్మల్ని కూడా చెన్నైలో విచారించారని శ్రీరెడ్డి తెలిపారు.
మేమే పట్టించామని అనుకుంటున్నాడు
పోలీసు విచారణకు నాతో పాటు మేనేజర్, రవీంద్రన్(రెడ్డి డైరీ నిర్మాత) హాజరయ్యారు. మమ్మల్ని పలు ప్రశ్నలు అడిగారు. సుబ్రమణ్యం ఇల్లు, ఆఫీసు ఎక్కడ అని అడిగితే చూపించాం. కానీ మేమే పోలీసులను తీసుకొచ్చి పట్టించామని అతడు భావించి... నా మీద దాడికి ప్లాన్ చేశాడు. నాపై దాడి జరుగడానికి ముందు ప్రొడ్యూసర్ రవీంద్రన్ ఇంటికి కూడా వెళ్లారు. కానీ రవిగారు అతడిని ఇంట్లోకి రానివ్వలేదు... అని శ్రీరెడ్డి తెలిపారు.