twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మపై నిషేధం ఉంటుందా? నాగ్ మూవీ పరిస్థితి ఏంటి? అల్లు అరవింద్ సమాధానం ఇదీ

    By Bojja Kumar
    |

    Recommended Video

    Allu Aravind Fires On Ram Gopal Varma

    కాస్టింగ్ కౌచ్ అంశం, శ్రీరెడ్డి ఇష్యూలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనవసరంగా కల్పించుకుని అత్యంత నీచమైన చర్యలకు పాల్పడ్డాబని, నికృష్ఠమైన ప్లాన్స్ వేశాడని, తెలుగు సినిమా పరిశ్రమ పరువు పోయేలా అత్యంత దారుణమైన కుట్రలు చేశాడంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అరవింద్ మాట్లాడిన తీరును పరిశీలించిన చాలా మందిలో ఆర్జీవీని తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి బహిష్కరిస్తారేమో? అనే అనుమానలు వ్యక్తం అయ్యాయి. ఇదే విషయమై కొందరు మీడియా ప్రతినిధులు నేరుగా అల్లు అరవింద్‌కు ప్రశ్నలు సంధించారు.

    రామ్ గోపాల్ వర్మ మీద బ్యాన్ వేస్తారా?

    రామ్ గోపాల్ వర్మ మీద బ్యాన్ వేస్తారా?

    నీచమైన కుట్రలకు పాల్పడిన రామ్ గోపాల్ వర్మపై టాలీవుడ్లో నిషేదం విధిస్తారా? అనే ప్రశ్నకు అల్లు అరవింద్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘అటువంటివి కోరడానికి ఇండస్ట్రీ మొత్తానికి నేనొక్కన్నే కాదుకదా, ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది ఉన్నారు' అని అరవింద్ సమాధానం ఇచ్చారు. ఆయన సమాధానంలో వర్మపై బ్యాన్ వేయాలనే కోపం అయితే కనిపించింది.

    అలా చేయడానికి నేనొక్కడిని సరిపోను

    అలా చేయడానికి నేనొక్కడిని సరిపోను

    బ్యాన్ చేయడం, అతడి సినిమాలు నిషేధించడం లాంటి ప్రపోజల్స్ పెట్టడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ సినిమాను ఆపేసేయండి, రామ్ గోపాల్ వర్మ సినిమా రిలీజ్ అవ్వకుండా చూడండి అనడానికి నేనొక్కడిని సరిపోను. ఇండస్ట్రీ మొత్తం రియాక్ట్ అవ్వాలి.... అని అల్లు అరవింద్ తెలిపారు.

    కాంపిటీషన్ కమీషన్ అని ఒక సంస్థ ఉంది

    కాంపిటీషన్ కమీషన్ అని ఒక సంస్థ ఉంది

    కాంపిటీషన్ కమీషన్ అని ఒక సంస్థ ఉంది. దాని నిబంధనల ప్రకారం ఎవరూ ఎవరినీ బ్యాన్ చేయలేరు. కాంపిటీషన్ కమీషన్ రూల్స్ పరిగణలోకి తీసుకుని ఏం చేయగలదో ఇండస్ట్రీ ఆలోచించుకోవాలి. అందువల్ల ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మను బ్యాన్ చేయండి లాంటి మాటలు నేను మాట్లాడ కూడదు.... అని అల్లు అరవింద్ తెలిపారు.

     బ్యాన్ విధిస్తే నాగ్ మూవీ పరిస్థితి ఏమిటి?

    బ్యాన్ విధిస్తే నాగ్ మూవీ పరిస్థితి ఏమిటి?

    ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ నాగార్జున హీరోగా ఆఫీసర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత కూడా ఆయనే. ఒక వేళ వర్మ మీద నిషేధం విధిస్తే పరిస్థితి ఏమిటి? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

    ఎన్టీఆర్ బయోపిక్ కూడా

    ఎన్టీఆర్ బయోపిక్ కూడా

    దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమా కూడా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం లక్ష్మీ పార్వతి కోణంలో ఉంటుందని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ సినిమాకు నందమూరి ఫ్యామిలీ కూడా వ్యతిరేకంగానే ఉంది. వర్మ మీద బ్యాన్ విధిస్తే నందమూరి ఫ్యామిలీ నుండి కూడా మద్దతు లభించే అవకాశం ఉందని అంటున్నారు.

    English summary
    Tollywood biggies trying to ban on Ram Gopal Varma about Pawan Kalyan and sri Reddy issue. But it's not possible, Producer Allu Aravind said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X