త్రాగి పట్టుబడ్డ రైటర్ కోన వెంకట్
ఇక కోన వెంకట్ మొత్తానికి దర్శకుడుగా మారుతున్నారు. అయితే ఆయన పెద్ద హీరోను డైరక్ట్ చేస్తారనుకుంటే ..మొదట ఓ చిత్రం డైరక్ట్ చేసి తర్వాత పెద్ద హీరోతో ప్లాన్ చేస్తానని చెప్తున్నారు. వంశీ మాదిరాజు, రామ్ గోలి అనే ఇద్దరు ఎన్నారైలు ఆయన తో చిత్రం నిర్మిస్తున్నారు. లాఫింగ్ బుద్ద ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. గతంలో కోన వెంకట్....పవన్ తో ప్రాజెక్టు అనుకున్నారు. అయితే కోన వెంకట్ ని మీడియా వారు..ప్రశ్నిస్తే..ఆయన సమాధానంతో ఈ ప్రాజెక్టుకి క్లారిటీ ఇచ్చారు.
కోన వెంకట్ మాట్లాడుతూ... పవన్‌కల్యాణ్.. ఆయనతో సినిమా తీయాలనేది నా ఆశ, నా ఆశయం. మనసులో మాలిన్యం అనేది లేని మంచిమనిషి ఆయన. పర్సనల్‌లైఫ్‌ని, ప్రొఫెనల్ లైఫ్‌ని అస్సలు మిక్స్ చేసి చూడరాయన. ఆయనలో ఉన్న గొప్ప క్వాలిటీ అది. ఒక వ్యక్తి దగ్గర టాలెంట్ ఉందంటే వాడు చుట్టం అయి ఉండక్కర్లేదు, ఫ్రెండవనక్కర్లేదు. చివరకు రోడ్డు మీద పోయేవాడైనా సరే.. పిలిచి మరీ అవకాశం ఇస్తాడు. చాలామందికి అవకాశం ఇచ్చాడు కూడా అన్నారు. అలాగే... ప్రస్తుతం వాళ్లందరూ స్కోడా కార్లేసుకొని మన కంటి ముందే తిరుగుతున్నారు. దటీజ్ పవర్‌స్టార్. నేనోసారి 'కల్యాణ్ మీరు చాలామందికి అవకాశం ఇచ్చారు కదా.. నేను ఓ మంచి కథ తెచ్చుకుంటే నాకూ అవకాశం ఇస్తారా' అని అడిగా. 'ఎందుకివ్వను. ఇవ్వకపోవడానికి నాకేమైనా పిచ్చా. మంచి కథ తీసుకురా చేద్దాం' అన్నారు.


Click it and Unblock the Notifications












