Stranger Things 4 స్క్విడ్ గేమ్ రికార్డుపై గురిపెట్టిన స్ట్రేంజర్ థింగ్స్ 4.. నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు వ్యూస
కరోనావైరస్ లాక్‌డౌన్ కాలంలో ఓటీటీ రంగం అనూహ్యంగా వేగం పుంజుకొన్నది. సినిమాలతోపాటు వెబ్ సిరీస్‌కు విశేషంగా ఆదరణ దక్కింది. ముఖ్యంగా ఇండియాలో వెబ్ సిరీస్ వీక్షణ అనూహ్యంగా పెరగడంతో ఓటీటీ రంగం కొత్త పుంతలు తొక్కింది. ఎన్నో వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల మన్నలను అందుకొన్నాయి. ఇంగ్లీష్‌తోపాటు వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ రికార్డు వ్యూస్ సాధించడం విశేషంగా మారింది.

స్ట్రేంజర్ థింగ్స్‌కు భారీ రెస్సాన్స్
కంటెంట్ పరంగా వైవిధ్యం చాటుకొనే వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకులు పట్టం కట్టిన సందర్భాలు ఎన్నో కనిపించాయి. ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్ లాంటి వెబ్ సిరీస్ సంచలన విజయాలు అందుకొన్నాయి. తాజాగా అదే కోవలో నెట్ ఫ్లిక్స్‌లో రిలీజైన స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సీజన్ 4కు భారీ ప్రేక్షకాదరణ దక్కింది.

గత 28 రోజుల్లో స్ట్రేంజర్ థింగ్స్
నెట్‌ఫ్లిక్స్‌లో విశేషంగా ప్రేక్షకాదరణ పొందిన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4 గత 28 రోజుల్లో 1.15 బిలియన్ గంటల వ్యూస్‌ను సాధించింది. తొలుత విడుదలైన ఏడు ఎపిసోడ్స్‌కు 930.32 మిలియన్ గంటల వ్యూస్ రాగా, జూలై 1వ తేదీన రిలీజైన 8, 9 ఎపిసోడ్స్‌కు 301.28 మిలియన్ గంటల వ్యూస్ లభించాయి. జూన్ 27వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు ఈ వ్యూస్ సాధించినట్టు నెట్‌ఫ్లిక్స్ వర్గాలు ధృవీకరించాయి.

స్క్విడ్ గేమ్స్ రికార్డుపై గురి
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 4కు రెస్సాన్స్ భారీగానే కొనసాగుతున్నది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ రికార్డు వ్యూస్ సాధించిన కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్స్ ఘనతను అధిగమించే అవకాశం ఉంది. గతవారాలతో పోల్చుకొంటే చివరి రెండు ఎపిసోడ్స్ 75 శాతం వృద్ధిని సాధించింది. అన్ని భాషల్లోను ఇలాంటి రెస్పాన్స్ లభిస్తున్నట్టు సమాచారం.

స్క్విడ్ గేమ్స్ వ్యూస్ ఎంతంటే?
ఇదిలా ఉండగా, స్క్విడ్ గేమ్స్ వెబ్ సిరీస్ రిలీజైన 28 రోజుల్లోనే రికార్డు వ్యూస్ సాధించింది. ఈ వెబ్ సిరీస్ ఏకంగా 1.65 బిలియన్ గంటల వ్యూస్‌ను సాధించింది. ఈ రికార్డుపై స్ట్రేంజర్ థింగ్స్ 4 గురిపెట్టింది. మరికొద్ది రోజుల్లోనే ఈ వెబ్ సిరీస్ రికార్డు వ్యూస్ సాధించే అవకాశం ఉంది.

స్ట్రేంజర్ థింగ్స్ 4 రికార్డుల పరంపర
స్ట్రేంజర్ థింగ్స్ 4 సీజన్ ఇప్పటికే పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు విడుదలైన నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో అతి వేగంగా వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్‌గా స్ట్రేంజర్ థింగ్స్ 4 రికార్డును సొంతం చేసుకొన్నది. అమెరికాలో అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్‌గా స్ట్రేంజర్ థింగ్స్ రికార్డును తన ఖాతాలో వేసుకొన్నది.


Click it and Unblock the Notifications











