For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Oka Chinna Viramam review: పునర్నవి భూపాళం, నవీన్ నేని ఫెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే..

  |

  Rating:
  2.0/5
  Star Cast: పునర్నవి భూపాళం, నవీన్ నేని, సంజయ్ వర్మ, గరీమా సింగ్, అల్విన్ బెర్త్రామ్
  Director: సందీప్ చేగూరి

  యువ వ్యాపారవేత్త దీపక్ (సంజయ్ వర్మ) తన భార్య సమీరా (గరీమా సింగ్)తో కలిసి ఫుడ్ బిజినెస్ చేస్తుంటాడు. గర్బవతి అయిన సమీరా ప్రసవానికి సిద్దంగా ఉన్న సమయంలో మరో వ్యాపారవేత్త (అల్విన్ బెర్త్రామ్)తో బిజినెస్ చర్చలు జరుగుతాయి. కానీ సమీరా ఆ డీల్‌ను వ్యతిరేకిస్తుంది. అయితే డబ్బు త్వరగా సంపాదించాలనే ఆశతో దీపక్.. తన భార్యతో చెప్పకుండా అక్రమ వ్యాపారానికి సంబంధించిన డీల్ ఓకే చేయడానికి 3 కోట్ల ధనంతో బయలుదేరుతాడు.

  అయితే తనకు చెప్పకుండా బిజినెస్ డీల్ చేయడానికి వెళ్తున్న దీపక్‌ను ఆ ఒప్పందం చేసుకోకుండా ఆపాలని ఓ ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్‌లో భాగంగా మాయ (పునర్నవి భూపాళం, బాల (నవీన్ నేని) రంగంలోకి దించుతుంది. మాయ, బాలా ఏ రకంగా ఆ డీల్‌ను అడ్డుకొన్నారు? దీపక్‌తో మరో వ్యాపారవేత్త ఎలాంటి అక్రమ వ్యాపారం చేయాలనుకొన్నాడు. చివరకు అక్రమ వ్యాపారానికి సమీరా ఎలా చెక్ పెట్టింది అనే ప్రశ్నలకు సమాధానమే ఒక చిన్న విరామం సినిమా కథ.

  ఒక చిన్న విరామం సినిమా కథ, కథనాల విషయానికి వస్తే.. కథలో పెద్దగా కొత్తదనం లేకపోవడంతో విభిన్నమైన కథనంతో ప్రేక్షకుడిలో ఆసక్తిని నింపేందుకు ప్రయత్నించారు. స్క్రీన్ ప్లే విషయంలో సరికొత్తగా అనుసరించాలని అనుకొన్నప్పటికీ.. బలమైన పాయింట్ లేకపోవడంతో కథను సాగదీశారా అనే ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు రాసుకొన్న ఓ ఎమోషనల్ పాయింట్‌ను మరింత ఎఫెక్ట్‌గా చెప్పి ఉంటే డెఫినెట్‌గా తెలుగు సినిమాలో మరో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ అయి ఉండేదేమో అనిపిస్తుంది. పునర్నవి, నవీన్ పాత్రలను మరింత బలంగా రాసుకోంటే కొంత కథలో నావెల్టీ ఉండటానికి అవకాశం ఉండేది. ఇలాంటి మరికొన్ని లోపాల వల్ల ఒక మంచి పాయింట్‌ సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదేమో అనిపిస్తుంది.

  Punarnavi Bhupalams Oka Chinna Viramam review

  ఒక చిన్న విరామం చిత్రంలో ప్రధానంగా దీపక్, సమీరా పాత్రలే బలంగా కనిపిస్తాయి. ఈ రెండు పాత్రలకు సంజయ్ వర్మ, గరీమా సింగ్ తమ పరిధి మేరకు ఓకే అనిపించారు. ఇక నటనపరంగా ప్రతిభావంతులైన పునర్నవి, నవీన్ పాత్రల్లో ఇంటెన్సిటీ లేకపోవడం వల్ల వాళ్లు పెద్దగా తన ప్రతిభను చాటుకోలేకపోయారు. అంతేకాకుండా తెర మీద వారి పాత్రలు తేలిపోయాయని చెప్పవచ్చు. పోలీస్ ఆఫీసర్, ఇతర పాత్రల్లో కనిపించిన వారు ఒకే అనిపించారు.

  సాంకేతిక విభాగాల పనితీరు చూస్తే.. ఒక చిన్న విరామం సినిమాకు సినిమాటోగ్రఫి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రోహిత్ బచ్చు ఉపయోగించుకొన్న లైటింగ్ తీరు వల్ల సన్నివేశాలు అందంగా కనిపించాయి. ఆర్ట్ విభాగం వర్క్ కూడా బాగుంది. అలాగే భరత్ మంచిరాజు మ్యూజిక్ ముఖ్యంగా రీరికార్డింగ్ బాగుంది. కొన్ని సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయి. ఆ విషయంలో అశ్వంత్ శివకుమార్ జాగ్రత్త పడి ఉండాల్సింది.

  డ్రగ్స్ బిజినెస్ ప్రధాన కథాంశంగా రూపొందిన చిత్రం ఒక చిన్న విరామం. పిల్లలకు ఆరోగ్యానికి నాశనం చేసే కల్తీ, డ్రగ్స్ ఆధారిత ఆహారాన్ని అందించకూడదనే చక్కటి పాయింట్‌తో మంచి ప్రయత్నం చేశారనిపిస్తుంది. కానీ కథ, కథనాల్లో కొన్ని లోపాలు, పాత్రల పరంగా స్క్రిప్టులో కొంత బ్యాలెన్స్, ఎమోషనల్ పాయింట్స్ లేకపోవడం ఈ సినిమాకు ప్రతికూలంగా మారాయి. సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్స్ ఇష్టపడే వారికి వీకెండ్‌లో చూడటానికి, ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉన్న సినిమా. ఓటీటీలో రిలీజ్ చేసి ఉన్నారు కాబట్టి కమర్షియల్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం కనిపించదు.

  నటీనటులు: పునర్నవి భూపాళం, నవీన్ నేని, సంజయ్ వర్మ, గరీమా సింగ్, అల్విన్ బెర్త్రామ్ తదితరులు
  రచన, దర్శకత్వం: సందీప్ చేగూరి
  సినిమాటోగ్రఫీ: రోహిత్ బచ్చు
  మ్యూజిక్: భరత్ మంచిరాజు
  ఎడిటర్: అశ్వంత్ శివకుమార్
  ఓటీటీ రిలీజ్: ఆహా
  ఓటీటీ రిలీజ్ డేట్: 2021-07-09

  English summary
  Oka Chinna Viramam movie is suspense Thriller movie which released on AHA OTT. Punarnavi Bhupalam, naveen neni, Sanjay Varma and Garima Singh are in lead roles. It released on 9th July. So Telugu filmibeat brings exclusive review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X