twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్‌కు రాంగోపాల్ వర్మ అవసరం లేదు.. అయినా ఆయన అంటూ నాగబాబు సెన్సేషనల్ కామెంట్

    |

    మెగా బ్రదర్ నాగబాబు‌కు డబ్బు విలువ ఎంటో స్పష్టంగా తెలుసు. ఓ దశల్లో ఆర్థికంగా చితికిపోయి మానసిక క్షోభకు గురయ్యారనే విషయం అందరికి తెలిసిందే. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆయన మానసిక ధైర్యాన్ని కూడగట్టుకొని మళ్లీ ఆర్థికంగా నిలదొక్కవడం ఆయన పట్టుదలకు మారుపేరుగా నిలిచింది. ఈ క్రమంలో తన యూట్యూబ్ ఛానెల్‌లో డబ్బు ప్రాధాన్యం గురించి వివరిస్తూ రాంగోపాల్ వర్మపై నాగబాబు ఆసక్తికరమైన కామెంట్ చేస్తూ..

    ప్రతిభ ఉంటే డబ్బు సంపాదించడం తేలిక

    ప్రతిభ ఉంటే డబ్బు సంపాదించడం తేలిక

    సినీ పరిశ్రమలో డబ్బు సంపాదనకు ఓ లక్ష్యం, ఎంచుకొనే మార్గం చాలా ముఖ్యమైనది. చాలా మంది హీరోలు, డైరెక్టర్లు కావాలని కోరుకొంటారు. కానీ అందులో పోటీ ఎక్కువ, నిలదొక్కుకోవడం కష్టమైన పని. కానీ టెలివిజన్ రంగంలో గానీ, సినిమా రంగంలో గానీ రచయితలకు అవకాశాలు పుష్కలం. ప్రతిభ ఉంటే డబ్బు సంపాదించడం, కెరీర్‌ను చక్కదిద్దుకోవడం తేలిక అని నాగబాబు చెప్పారు.

    సినీ రచయితగా సాయిమాధవ్

    సినీ రచయితగా సాయిమాధవ్

    సినీ రచయితల్లో ప్రతిభావంతులైన వారిలో బుర్రా సాయిమాధవ్ ఒకరు. పదేళ్ల క్రితం తాను శిఖరం సినిమా చేస్తుంటే పరిచయం అయ్యారు. అద్భుతంగా డైలాగ్స్ రాయడం నా దృష్టికి వచ్చింది. ఆ తర్వాత ఓ సీరియల్‌కు మాటలు రాయడానికి రచయిత అవసరం ఏర్పడితే నేను సాయిమాధవ్‌ పేరు సూచించా. ఆ తర్వాత కృష్ణం వందే జగద్గురు, గోపాలా గోపాలా లాంటి సినిమాలతో స్టార్ రైటర్ అయ్యారు అని నాగబాబు చెప్పారు.

    డైరెక్టర్లుగా మారిన రచయితలు

    డైరెక్టర్లుగా మారిన రచయితలు

    సినీ రచయితలుగా ఇండస్ట్రీలోకి వచ్చి డైరెక్టర్లుగా మారిన కొరటాల శివ, త్రివిక్రమ్‌ శ్రీనివాస్ లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవచ్చు. వారు రచయితలుగా ప్రవేశించి ఆ తర్వాత డైరెక్టర్లుగా మారారు. ఒకసారి డైరెక్టర్లుగా మారిన తర్వాత మళ్లీ వెనకకు తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు వారి సినిమాలకు కథను వారే రాసుకొంటారు. సరైన కెరీర్‌ను ఎంచుకొంటే డబ్బు సంపాదించడం దానంతట అదే సాధ్యమవుతుంది.

    రాంగోపాల్ వర్మ ఇండస్ట్రీలోకి ప్రవేశించేటప్పుడు

    రాంగోపాల్ వర్మ ఇండస్ట్రీలోకి ప్రవేశించేటప్పుడు

    ఇక రాంగోపాల్ వర్మ తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చే సమయానికి ఆయన అవసరం టాలీవుడ్‌కు లేదు. అప్పటికే రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, బీ గోపాల్ లాంటి గొప్ప దర్శకులు ఉన్నారు. అలాంటి టైమ్‌లో రాంగోపాల్ వర్మ సరైన అవకాశం ఎదురుచూశాడు. నిర్మాత సురేంద్ర, నాగార్జున కలిసి శివ తీశాడు. శివ చిత్రంతో చరిత్ర తిరగరాశారు. ఇప్పటికీ కూడా శివ గొప్ప సినిమాగా మిగిలింది. తన అవసరం ఇండస్ట్రీకి లేకున్నా.. ఇండస్ట్రీకి తన అవసరం ఉందని చెప్పిన వ్యక్తి ఆర్జీవి అని నాగబాబు అన్నారు.

    Recommended Video

    Mega Brother Nagababu Comments on Pawan Kalyan's Upcoming Films
    ఇండస్ట్రీకి తన అవసరమేమిటో చెప్పిన వర్మ

    ఇండస్ట్రీకి తన అవసరమేమిటో చెప్పిన వర్మ

    శివ తర్వాత రాంగోపాల్ వర్మ మళ్లీ తిరిగి చూసుకోలేదు. సినిమా పరిశ్రమకు తన అవసరం ఏమిటో చెప్పిన దర్శకుడు రాంగోపాల్ వర్మ. సినిమా రంగంలో గొప్ప దర్శకుల్లో ఒకడినని అనిపించుకొన్నారు. ఇండస్ట్రీలో కొత్త ఒరవడి సృష్టించిన వ్యక్తిగా రాంగోపాల్ వర్మ మిగిలిపోయారు అని నాగబాబు చెప్పారు. సక్సెస్‌తోపాటు డబ్బు కూడా వర్మ చేజిక్కించుకొన్నారు. లేని అవసరాన్ని గుర్తించి ఇలా జీవించ వచ్చని వర్మ నిరూపించారని నాగబాబు పేర్కొన్నారు.

    English summary
    Mega Brother and Actor Naga babu revealed Money earning strategy. While talk about Career, Success, He has given examples of Ram Gopal Varma Success. Ram Gopal Varma created history after Shiva super hit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X