For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Samantha Ruth Prabhu ఇంట్లోకి దూరిన దొంగ.. అలా సమంతకు దొరికి.. పోలీసులకు బుక్కైన స్టార్ హీరో!

  |

  దక్షిణాదిలో అగ్రతార సమంత రుత్ ప్రభు కెరీర్ మంచి జోరుతో ముందుకు దూసుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తర్వాత సమంత హిందీ మార్కెట్‌పై దృష్టిపెట్టినట్టు ఆమె ప్రాజెక్టులు చూస్తే స్పష్టంగా తెలుస్తున్నది. నాగచైతన్యతో విడాకుల షాక్ నుంచి త్వరగానే కోలుకొన్న సమంత ప్రస్తుతం భారీ ప్రాజెక్టులపై కన్నేసినట్టు ఆమె ప్లానింగ్ చూస్తే అంతా అర్దమవుతున్నది. ఇటీవల బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌తో జతకట్టి ఫ్యాన్స్‌, ఇండస్ట్రీ వర్గాలను తనవైపు తిప్పుకొన్నది. ఈ వివరాల్లోకి వెళితే..

  బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు

  బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు

  నాగచైతన్యతో విడాకుల తర్వాత క్రేజీ ప్రాజెక్టులను సమంత ఎంపిక చేసుకొంటూ వెళ్తున్నది. తాజాగా పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‌తో రచ్చ చేసేసింది. ఊ అంటావా? ఊఊ అంటావా పాటతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా సమ్మోహనం చేసింది. దీంతో బాలీవుడ్ నుంచి భారీగా ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం.

  కుర్ కురే కలిపింది సమంత, అక్షయ్‌ను

  కుర్ కురే కలిపింది సమంత, అక్షయ్‌ను

  ఇలాంటి జోష్ మధ్య బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్‌తో సమంత జతకట్టి ఆశ్చర్య పరిచింది. అయితే అక్షయ్‌తో జతకట్టింది సినిమా కోసమే లేదా వెబ్ సిరీస్ కోసమో అయితే తప్పులో కాలేసినట్టే. అక్షయ్‌తో కలిసి సమంత ఓ వ్యాపార ప్రకటనలో మెరిసింది. వారిద్దరూ కుర్ కురే చిప్స్ ప్యాకెట్ ప్రొడక్ట్‌కు సంబంధించిన వ్యాపార ప్రకటనల్లో ఇద్దరు కలిసి నటించారు.

  కుర్ కురే వ్యాపార ప్రకటనలో

  కుర్ కురే వ్యాపార ప్రకటనలో

  కుర్ కురే వ్యాపార ప్రకటనలో సమంత ఇంట్లోకి దొంగగా అక్షయ్ కుమార్ ప్రవేశిస్తాడు. చీకటిలో టార్చ్ వేసుకొని డబ్బులు, నగలు కోసం వెతుకుతుంటే.. కుర్ కురే ప్యాకెట్ కనిపిస్తుంది. దాంతో కుర్ కురే అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో సమంత తన కుటుంబ సభ్యులతో వచ్చి.. ఇంత టేస్ట్ ఉన్న కుర్ కురేను ఒక్కడివే తింటావా? అంటూ సమంత ప్యాకెట్ చింపి అందులోని కుర్ కురేను తినేస్తుంది. అంతలోనే పక్కనే ఉన్న మహిళ.. నీవు కూడా కొంచెం తిను నాయనా అని చేతిలో పెడుతుంది. కుర్ కురే ప్యాకెట్ తినడం పూర్తి కాగానే.. నమస్తే అమ్మా.. వెళ్లొస్తా అంటూ అక్షయ్ కుమార్ వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. దాంతో ఉండు.. వెహికల్ తెప్పిస్తాను అని అంటుంది. అంతలోనే పోలీస్ వ్యాన్ సైరన్ మోగడం.. అక్షయ్ కంగారు పడటంతో.. మసాల దెబ్బ ఇప్పుడు తగులుతుంది అంటూ సమంత కామెంట్ చేస్తుంది. ఇలా అక్షయ్, సమంత వ్యాపార ప్రకటనలో కలిసి నటించారు.

  సమంత ఇంటికి తాళం లేదు అంటూ అక్షయ్

  సమంత ఇంటికి తాళం లేదు అంటూ అక్షయ్

  కుర్ కురే యాడ్‌లో నటించిన తర్వాత అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసి సమంత గురించి మాట్లాడారు. లైఫ్‌లో తొలిసారి దొంగతనం ట్రై చేస్తే.. నా బేజా ఫ్రై అయింది. సమంత ఇంటికి తాళం లేదు. కానీ కుర్ కురే కాటు వేసింది అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. #AbLagaMasala #Kurkure అనే హ్యాష్ ట్యాగ్స్ పెట్టి పోస్టును అభిమానులతో పంచుకొన్నారు.

  పోలీస్ ఆఫీసర్ కుర్ కురే దొంగగా

  పోలీస్ ఆఫీసర్ కుర్ కురే దొంగగా

  సోషల్ మీడియాలో అక్షయ్ కుమార్ పోస్టు చేసిన వీడియోపై సమంత స్పందించారు. సూర్యవంశీలో పోలీస్ ఆఫీసర్‌గా చేసిన అక్షయ్ కుమార్ కుర్ కురే ప్యాకెట్ కోసం దొంగగా మారాడు. akshaykumar ఏంటీ ఈ వైపరిత్యం. ఏంటీ నీ ప్రవర్తన అంటూ అక్షయ్ కుమార్ పోస్టుకు బదులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది.

  Pushpa లో Samantha ఐటెం సాంగ్.. కండిషన్స్ అప్లై..! || Filmibeat Telugu

  సమంత సినిమా కెరీర్ ఇలా..

  సమంత సినిమా కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో సమంత నటించారు. ఊ అంటావా? ఊఊ అంటావా పాటలో నర్తించిన సమంతకు మంచి రెస్సాన్స్ లభించింది. ఇక యశోదా అనే చిత్రంలోను, అలాగే తమిళ చిత్రం కాతువాకుల రెండు కాదల్‌లో నయనతారతో కలిసి నటిస్తున్నారు. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.

  English summary
  South Star Samantha Ruth Prabhu paired with Akshay Kumar in television commercial for Kurkure. Samantha share a post that, Police officer of the movie turns out to be a Kurkure chor. akshaykumar what is this behaviour?
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X