Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Varisu టెలివిజన్ సీరియలా? విజయ్‌పై అజిత్ ఫ్యాన్స్ ట్రోల్స్‌పై ఘాటుగా వంశీ పైడిపల్లి
తమిళనాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజైన చిత్రాలు మధ్య బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా కనిపిస్తున్నది. విజయ్ నటించిన వారిసు, అజిత్ నటించిన తునివు చిత్రాలు పోటాపోటీగా కలెక్షన్లు సాధిస్తున్నాయి. అయితే బాక్సాఫీస్ వేటలో వారిసు తడబాటు కనిపిస్తున్నది. అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన వారిసు చిత్రం తునివు కంటే తక్కువ వసూళ్లు సాధిస్తున్నది. అంతేకాకుండా వారిసు టెలివిజన్ సీరియల్‌లా మాదిరిగా ఉందనే విమర్శలపై వంశీ పైడిపల్లి స్పందించిన తీరు ఎలా ఉందంటే?

విజయ్ ఫ్యాన్స్‌తో అజిత్
వారిసు, తునివు రిలీజ్ తర్వాత తమిళనాడులో ఫ్యాన్స్ మధ్య భారీ యుద్దమే జరిగింది. బలమైన అభిమాన గణం ఉన్న ఇద్దరు స్టార్ హీరోల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో విజయ్, అజిత్ ఫ్యాన్స్ ఒకరిపై మరొకరు దారుణంగా ట్రోల్స్ వేసుకొన్నారు. వారిసు సినిమాపై అజిత్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు.

డైలీ సీరియల్ కంటే దారుణంగా
విజయ్
నటించిన
వారిసు
సినిమాపై
అజిత్
ఫ్యాన్స్
భారీగా
కామెంట్స్
చేశారు.
వంశీ
పైడిపల్లి
దర్శకత్వం
వహించిన
సినిమా
డైలీ
సీరియల్
కంటే
దారుణంగా
ఉందని
నెటిజన్లు
దాడి
చేస్తున్నారు.
ఈ
సినిమా
నిడివి,
సాగదీత
టెలివిజన్
సీరియల్
కంటే
ఎక్కువగా
ఉందనే
కామెంట్లు
వినిపించారు.

సినిమా తీయాలంటే జోక్ కాదు
అయిత
వారిసు
సినిమా
టెలివిజన్
అంటూ
దుష్ర్పచారం
చేస్తున్న
తీరుపై
దర్శకుడు
వంశీ
పైడిపల్లి
ఘాటుగా
స్పందించారు.
ప్రేక్షకులను
భావోద్వేగానికి
గురిచేసేందుకు
ఓ
సినిమా
తీయాలంటే
ఎంత
కష్టమో
తెలుసా?
ఒక
సినిమాను
ప్రేక్షకుల
ముందుకు
తీసుకురావడానికి
టీమ్
ఎంత
కష్టపడుతుందో
తెలుసా?
ఆడియెన్స్‌కు
వినోదాన్ని
అందించడం
చాలా
కష్టమైన
పని.
సినిమా
తీయడమంటే
జోక్
కాదు
అని
వంశీ
పైడిపల్లి
అన్నారు.

టెలివిజన్ సీరియల్స్‌పై చిన్నచూపా?
వారిసు
సినిమాను
టెలివిజన్
సీరియల్‌తో
పోల్చడంపై
వంశీ
పైడిపల్లి
అభ్యంతరం
వ్యక్తం
చేశారు.
మీరు
ఎందుకు
సీరియల్స్‌ను
డీ
గ్రేడ్
చేస్తున్నారు.
సాయంత్రం
వేళ
ప్రేక్షకులు
ఏ
రేంజ్‌లో
సీరియల్స్
చూసేందుకు
టీవీలకు
అతుకుపోతారో
తెలుసా?
అలాంటి
మనోరంజకమైన
సీరియల్స్‌ను
ఎందుకు
తక్కువ
చేసి
చూస్తారు?
సీరియల్స్‌తో
ప్రేక్షకులను
మెప్పించాలంటే
సృజనాత్మక
శక్తి
ఎంత
ఉండాలో
తెలుసా?
అని
వంశీ
పైడిపల్లి
ఘాటుగా
సమాధానం
ఇచ్చారు.

వారిసుతో వినోదాన్ని అందించాం
దర్శకుడిగా నేను కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తాను. వారిసు బ్రిల్లియెంట్ సినిమా అని చెప్పను. వారిసు ద్వారా నేను ఆడియెన్స్‌కు వినోదం పంచాలని అనుకొన్నాను. వారిసు ద్వారా నేను వినోదాన్ని అందించానని ఫీలవుతున్నాను. వారిసు మేము అనుకొన్న టార్గెట్‌ను రీచ్ అయింది అని వంశీ పైడిపల్లి తెలిపారు.

వారిసు, తునివు రెండు హిట్టే అంటూ
వారిసు సినిమా కంటే తునివు మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబడుతుందనే విషయంపై వంశీ పైడిపల్లి స్పందించారు. ఏ సినిమా బాగుంది? ఏ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి? అనే విషయంపై చర్చ వద్దు. తమిళనాడులో విజయ్, అజిత్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఆ విషయాన్ని వివాదంగా మలచకండి. సంక్రాంతి సీజన్‌లో రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి అని వంశీ పైడిపల్లి చెప్పారు.