For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నువ్వు వర్జినా అనడిగిన నెటిజన్.. ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చిన సురేఖా వాణి కూతురు!

  |

  తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు సురేఖ వాణి. తెలుగులో ఆమె తల్లి, అక్క, వదిన పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె కుమార్తె సుప్రీత కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.. గతంలో టిక్ టాక్ వీడియోలు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ తనదైన శైలిలో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా చాట్ సెషన్ నిర్వహించింది. అందులో అనేక మంది అనేక ప్రశ్నలు అడగగా నువ్వు వర్జిన్ ఏనా ? అని ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు మాత్రం దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  Surekha Vani & Her Daughter Angry On a Netizen

  Photos: Indian Celebs And Their Favourite Holiday Spots

  సోషల్ స్టార్

  సోషల్ స్టార్

  సురేఖ వాణి కుమార్తె సుప్రీతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.. సోషల్ మీడియాలో సుప్రీత చేసే హంగామా ఆమె చేసే వీడియోలు చూసి నెటిజన్లు ఎప్పటికప్పుడు ఫిదా అవుతూ ఉంటారు. టిక్ టాక్ ఉన్న రోజుల్లో తన తల్లితో కలిసి ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు.. టిక్ టాక్ నిషేధించబడ్డాక అదేవిధంగా ఇంస్టాగ్రామ్ లో కూడా ఆమె రకరకాల వీడియోలు చేస్తూ అలరిస్తోంది.

  Photos: Actresses Who Look Hot In Red

  వార్నింగ్

  వార్నింగ్

  ఇక ఆ మధ్య సునీత పెళ్లి చేసుకున్న సమయంలో సురేఖ వాణి కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సమయంలో సురేఖ వాణి తనకు అలాంటి ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చినా సరే ఎప్పటికప్పుడు ఆమె గురించి ప్రచారం జరుగుతూనే ఉంది. దీంతో ఆ విషయం మీద గట్టి వార్నింగ్ కూడా ఇచ్చిన సుప్రీత, తెలీకుండా మాట్లాడవద్దని కోరింది.

  Ishika Singh Hot & Spicy Photos

  ఖచ్చితంగా ప్రేమ పెళ్ళే

  ఖచ్చితంగా ప్రేమ పెళ్ళే

  ఇక తాజాగా తన అభిమానులతో ఒక చాట్ సెషన్ నిర్వహించిన సుప్రీత తనకు సంబంధించిన అనేక విషయాలు తన ఫాలోవర్స్ తో పంచుకుంది. ప్రేమ వివాహం చేసుకుంటారా ? లేకపోతే అరేంజ్డ్ వివాహం చేసుకుంటారా అంటే కచ్చితంగా ప్రేమ పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక పబ్స్, అలాగే నైట్ లైఫ్ ను మీరు మిస్ అవుతున్నారా అని అడిగితే అవును అని ఆమె సమాధానం ఇచ్చింది. ఇక కోడి ముందా గుడ్డు ముందా అనే ఒక అభిమాని అడగగా సరదాగా ఒక మీమ్ తో ఆమె సమాధానం ఇచ్చింది.

  Actress Aswini Hot Pics Photos

  నువ్వు వర్జినేనా ?

  నువ్వు వర్జినేనా ?

  అయితే నువ్వు వర్జినేనా ? అని ఒక నెటిజన్ ప్రశ్నించగా ఆమె ఊచించని సమాధానం ఇచ్చింది. తాజాగా వకీల్ సాబ్ సినిమాలో ఇలాంటి సీన్ ఒకటి వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఆ వీడియో షేర్ చేసిన ఈ భామ కాస్త సీరియస్ అయినట్టు అనిపించింది. ఇక మీకు నచ్చిన హీరో ఎవరు పవన్ కళ్యాణ్ లేదా ప్రభాస్ అని ప్రశ్నించగా ఎప్పటికీ పవన్ కళ్యాణ్ అని సమాధానమిచ్చింది.

  Evelyn Sharma Hot Photoshoot For Maxim Photos

  నాతోనే ఉంటారు

  నాతోనే ఉంటారు

  అలాగే ఒక నెటిజన్ మీ నాన్న మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది మీరు ఎందుకు అంత దృఢంగా ఉండగలిగారు ? ఎందుకంటే నేను ప్రస్తుతం అలాంటి పరిస్థితిలో ఉన్నా ప్లీజ్ చెప్పండి అని ఆడిగారు. దీంతో అప్పుడు దేవుడు నా పక్కనే ఉన్నాడేమో, నాకు అంత స్ట్రెంత్ ఎలా వచ్చిందో నాకు ఈ రోజుకీ తెలియదు, ఆయన లేకపోవడాన్ని నేను ఇప్పటికీ మిస్ అవుతున్నాను కానీ నాకు తెలుసు ఆయన ఎప్పటికీ నాతోనే ఉంటారని అని చెప్పుకొచ్చింది.

  English summary
  Supritha Naidu, the daughter of popular character artist Surekha Vani is very active on social media. in her recent interaction with her followers she made some intresting comments.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X