అమెరికా ప్రయాణంలో తాతయ్య మరణం, అంత్యక్రియలకు ఆ కమెడియన్ వద్ద అప్పు చేశా: పొట్టి నరేష్

జబర్దస్త్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టుల జీవితాలకు ఒక దారి దొరికింది. అంతకుముందు వరకు అవకాశాల కోసం ఎంతగానో శ్రమించిన ఒకప్పటి జూనియర్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు జబర్దస్త్ ద్వారా సత్తా చాటుకొని స్టార్ కమెడియన్స్ గా కొనసాగుతున్నారు. ఇక పొట్టి నరేష్ కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. తన లోపంతోనే సరదాగా కామెడీ చేస్తూ అందరిని నవ్వించడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా పోషిస్తున్నాడు.

జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు..

జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు..

ఇక రీసెంట్ గా యూ ట్యూబ్ లో ఒక వీడియో రిలీజ్ చేసిన నరేష్ తన ఇంటిని అలాగే తన జీవితంలో వచ్చిన బహుమతులను, సాధించిన అవార్డులను, షీల్డ్స్ ని చూపించాడు. ఒకవైపు కామెడీగా మాట్లాడుతూనే మరోవైపు తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా గుర్తు చేసుకున్నారు.

డబ్బుకంటే నాకు ఇవే ఇష్టం..

డబ్బుకంటే నాకు ఇవే ఇష్టం..

తనకు వచ్చిన షీల్డ్స్, ట్రోపిలు, బహుమతులతోనే ఇంటిని నింపేసిన నరేష్ అవే తనకి ధనానికి మించిన ఆస్తులన్ని వివరణ ఇచ్చాడు. ఒక్కో షీల్డ్ కి ఒక్కో ప్రత్యేకత ఉందని వచ్చింది చిన్న పురస్కరమైనా కూడా తనకు చాలా సంతృప్తిని ఇచ్చామని డబ్బు కంటే నాకు అవే చాలా ఇష్టమని నరేష్ వివరణ ఇచ్చిన విధానం నెటిజన్స్ ని ఎక్కువగా ఆకట్టుకున్నాయి.

తాతయ్య చనిపోతే..

తాతయ్య చనిపోతే..

ఇక అమెరికాలో వచ్చిన ఒక షీల్డ్ గురించి వివరణ ఇచ్చిన నరేష్ దీనికి చాలా ప్రత్యేకమైన ఘటనతో సంబంధం ఉందని అది నేను ఎప్పటికి మరచిపోలేనని అన్నాడు. ఎందుకంటే మా తాతయ్య చనిపోయినప్పుడు అమెరికా వెళుతుండగా సడన్ గా తాతయ్య చనిపోయవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. కనీసం అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు.

ఆ కమెడియన్ వద్ద అప్పు..

ఆ కమెడియన్ వద్ద అప్పు..

ఇక జబర్దస్త్ కమెడియన్ భాస్కర్ అన్నని సహాయం అడగడంతో ఆయన డబ్బు ఇచ్చారు. ఆ అప్పుతోనే అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది. ఇక అమెరికా మొదటి సారి అప్పుడే వెళ్ళాను. అక్కడ మన తెలుగు వాళ్ళు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన షీల్డ్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. అందుకే దీన్ని నేను ఎప్పటికి మరచిపోలేను అను నరేష్ తెలిపాడు.

Recommended Video

Actor Naresh Starts Dubbing For Jathi Ratnalu movie
ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి..

ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి..

ఇక త్వరలోనే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్నది కూడా తన ఆశయమని చెప్పిన నరేష్ ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోతో పాటు మరికొన్ని షోలతో బిజీగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఈ కమెడియన్ పలు సినిమాల్లో కూడా నటిస్తున్నాడట. ఓ వైపు షోలు ప్రోగ్రామ్ లు చేసుకుంటున్న నరేష్ రెండు చేతుల సంపాదిస్తు తన కలల కోసం సేవింగ్స్ చేసుకుంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X