For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SS Rajamouliతో గిల్లించుకొన్న యాంకర్ సుమ.. అలియాభట్, రణ్‌బీర్ ముందే చిలిపిగా!

  |

  ఇండియన్ సినిమా చరిత్రలో భారీ బడ్జెట్, అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన చిత్రం బ్రహ్మస్త్ర. ఈ సినిమాను తెలుగులో బ్రహ్మాస్త్రం టైటిల్‌తో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను భారీగా ప్లాన్ చేశారు జక్కన్న. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా యాంకర్ సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న క్యాష్ షోలో ఆలియా, రణ్‌బీర్ కపూర్, ఎస్ఎస్ రాజమౌళి చేసిన హంగామా విషయంలోకి వెళితే..

  SS రాజమౌళి సమర్పణలో బ్రహ్మస్త్రం

  SS రాజమౌళి సమర్పణలో బ్రహ్మస్త్రం

  రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న బ్రహ్మస్త్రం మూవీని తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు. దక్షిణాదిలో ఈ సినిమాను జక్కన్న డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ పర్యటనలో రణ్‌బీర్, ఆలియా జంట పలు ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొన్నారు. తాజాగా ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు 6 ఈవెంట్‌లో రణ్‌బీర్ తెలుగులో మాట్లాడి.. అలియాభట్ తెలుగులో పాడి ఆకట్టుకొన్నారు.

   యాంకర్ సుమ క్యాష్‌లో ఆలియా, రణ్‌బీర్

  యాంకర్ సుమ క్యాష్‌లో ఆలియా, రణ్‌బీర్


  బ్రహ్మస్త్ర ప్రమోషన్‌లో భాగంగా ఎస్ఎస్ రాజమౌళితోపాటు ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ యాంకర్ సుమ నిర్వహించే క్యాష్ ప్రొగ్రాంలో సందడి చేశారు. ఈ షోలో ఉత్సాహంగా పాలుపంచుకొంటూ.. గేమ్స్ ఆడుతూ సినిమా గురించిన విశేషాలను వెల్లడించారు. మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన క్యాష్ షోలో బాలీవుడ్ స్టార్స్ పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషంగా మారింది.

   శనివారం పూర్తి ఎపిసోడ్ ప్రసారం

  శనివారం పూర్తి ఎపిసోడ్ ప్రసారం


  సుమ నిర్వహించే క్యాష్ షోలో బ్రహ్మస్త్ర టీమ్ పాల్గోని ఈ ప్రమోషనల్ కార్యక్రమాన్ని మరింత సరదాగా మార్చేశారు. ఇప్పటికే క్యాష్ షోకు సంబంధించిన ప్రోమోలు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆలియా, రణ్‌బీర్ పాల్గొన్న క్యాష్ పూర్తి ఎపిసోడ్ సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి 9.30 గంటలకు ఈటీవీలో ప్రసారం కానున్నది.

   రాజమౌళి వద్దకు సుమ వెళ్లి

  రాజమౌళి వద్దకు సుమ వెళ్లి


  ఆలియా, రణ్‌బీర్ పాల్గొన్న క్యాష్ షోలో సుమ యాంకరింగ్ మరింత ఫన్‌గా మారిపోయిందనే విషయం తాజా ప్రోమో స్పష్టం చేసింది. రాజమౌళిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ.. ఆయన ముందు ఫ్లాప్ అనే పదం కూడా ఫ్లాప్ అయిపోయింది. ఆయనే రాజమౌళి గారు.. స్వాగతం అంటూ సుమ మాటలతో రెచ్చిపోయింది. స్టేజ్ మీదకు రాగానే.. పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఆయన వద్దకు వెళ్లి.. ఒకసారి గిచ్చరా అండి.. అని సుమ అడిగితే... చేయిపై సుతారంగా రాజమౌళి నవ్వుతూ గిల్లాడు. దాంతో మీరు మా క్యాష్ షోకు వచ్చారు అంటూ సుమ ఆనందంలో మునిగిపోయింది. సుమ, రాజమౌళి మధ్య జరిగిన చిలిపి సంఘటన చూసి ఆలియా తలకొట్టుకోగా, రణబీర్ చప్పట్లు కొడుతూ స్వాగతించాడు.

  సుమ క్యాష్ షోకు గౌరవం అంటూ


  సుమ నిర్వహించే క్యాష్ ప్రొగ్రాంకు బాలీవుడ్ స్టార్స్ రావడంపై అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఏకంగా క్యాష్‌కు బాలీవుడ్ స్టార్స్ వచ్చారు. వారి రాకతో తెలుగు స్థాయి గౌరవం పెరిగింది. ఈ గౌరవం సుమకు మాత్రమే సొంతం. ఈ ఎపిసోడ్‌ కోసం శనివారం ఎప్పుడొస్తుందా అంటూ వెయిటింగ్ అని అభిమానుల కామెంట్స్ పెట్టారు.

  బ్రహ్మస్త్ర తెర వెనుక, తెర ముందు

  బ్రహ్మస్త్ర తెర వెనుక, తెర ముందు

  ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌనీ రాయ్ నటించిన బ్రహ్మస్త్ర సినిమా వివరాలు ఇలా ఉన్నాయి..
  రచన, దర్శకత్వం: అయాన్ ముఖర్జీ
  డైలాగ్స్: హుస్సేన్ దలాల్
  నిర్మాతలు: కరణ్ జోహర్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, రణ్‌బీర్ కపూర్, మారికే డిసౌజా, ఆయాన్ ముఖర్జీ
  సినిమాటోగ్రఫి: వీ మణికందన్, పంకజ్ కుమార్, సుదీప్ చటర్జీ, వికాశ్ నౌలాఖా, ప్యాట్రిక్ డ్యురోక్స్
  ఎడిటింగ్: ప్రకావ్ కురుప్
  సంగీతం: ప్రీతమ్
  బ్యాక్ గ్రౌండ్ స్కోర్: సిమాన్ ఫ్రాంగ్లేన్
  బ్యానర్స్: స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్
  రిలీజ్ డేట్: 2022-09-09

  English summary
  Brahmastra will be promoted in Telugu television's biggest reality game show CASH. The iconic show hosted team Brahmastra as the key cast, Ranbir Kapoor, Alia Bhatt, Mouni Roy, and Rajamouli himself participated in the shoot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X