twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Roja పై యాక్టర్ పృథ్వీ దారుణంగా కామెంట్.. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు అంటూ!

    |

    ఉత్తరాంధ్రలో జనవాణి కార్యక్రమానికి వైజాగ్ చేరుకొన్న పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు జనసైనికులు భారీగా స్వాగతం పలికారు. అయితే పవన్ కల్యాణ్ కోసం జనం రాలేదని కొన్ని టెలివిజన్ ఛానెల్స్‌ చేస్తున్న ప్రచారంపై నటుడు, జనసేన నేత థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఘాటుగా స్పందించారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్స్‌లో పృథ్వీ మాట్లాడుతూ రోజాపై విమర్శనాస్త్రాలు సంధించారు. పృథ్వీ చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

    ఏపీ రాజకీయాల్లో విస్పోటనం

    ఏపీ రాజకీయాల్లో విస్పోటనం


    ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఒక విస్పోటనం జరిగే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్‌ను స్వాగతించేందుకు భారీగా వచ్చారు. అయితే పవన్ సభకు వందల్లో వచ్చారని దుష్ప్రచారం చేసిన మీడియా ఛానెల్స్‌ తీరును పృథ్వీ తప్పుపట్టారు. పవన్ కల్యాణ్ క్రేజ్‌ను తగ్గించేందుకు కుట్రలు పన్నే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదంతా ప్రజలు సోషల్ మీడియా ద్వారా గ్రహిస్తున్నారు అని పృథ్వీ చెప్పారు.

    వైజాగ్‌లో వైసీపీ గర్జన ఫ్లాప్ అంటూ

    వైజాగ్‌లో వైసీపీ గర్జన ఫ్లాప్ అంటూ

    వైజాగ్‌లో వైసీపీ గర్జన కార్యక్రమం ఫ్లాప్ కావడంతో జనసేన కార్యక్రమంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మా సినిమా ఫ్లాఫ్ అయిందనే డీలా పడిన కొందరు.. పవన్ కల్యాణ్‌కు వచ్చిన క్రేజ్‌ను చూసి ఒక అక్కసుతో దుష్ప్రచారం చేస్తున్నారు. మా సినిమా ఫ్లాప్ అయింది.. ఇక ఎదుటి వారి సినిమాను భ్రష్టుపట్టించినట్టు.. ఫస్టాఫ్ బాగాలేదు.. సెకండాఫ్ బాగాలేదు అంటారు. అదే తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నేతల్లో కనిపించింది అని పృథ్వీ ఎద్దేవా చేశారు.

    మంత్రి రోజాపై నేను ఎన్నడూ

    మంత్రి రోజాపై నేను ఎన్నడూ


    పవన్ కల్యాణ్‌పై ఎన్నిసార్లు నోరు పారేసుకొన్నప్పటికీ సినీనటి, మంత్రి రోజాపై నేను ఎన్నడూ కామెంట్ చేయలేదు. కానీ పవన్ కల్యాణ్‌ను దూషించకపోతే.. మంత్రి పదవి పోతుందనే అభద్రతాభావం ఆమెలో ఉంది. అందుకే ఆమె దిగజారుడు విమర్శలు చేస్తున్నారు. మేమంతా కళామతల్లి బిడ్డలం. కాబట్టి హుందాగా ఉంటాం. రోజా ఆ హుందాతనాన్ని చూపించుకోవడం లేదు అంటూ పృథ్వీ కామెంట్ చేశాడు.

    వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయవద్దు

    వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయవద్దు

    రాజకీయంగా ఎదుర్కోనలేకనే.. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకొన్నాడు. రెండు చోట్ల ఓడిపోయాడు అని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఓటమి విజయానికి నాంది. వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేయవద్దు. పెళ్లికి విశాఖ జిల్లా అమ్మాయి కావాలి.. కానీ రాజధాని వద్దా? అని రోజా చేసిన వ్యాఖ్యలను పృథ్వీ తప్పుపట్టారు. రోజా తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకొన్నది. చెన్నైలో రాజధాని పెడుతారా అని పృథ్వీ ప్రశ్నించారు.

    విద్యుత్ సరఫరాను నిలిపివేత

    విద్యుత్ సరఫరాను నిలిపివేత

    వైజాగ్‌కు పవన్ కల్యాణ్‌ చేరుకొన్న తర్వాత నగరంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అయినా అభిమానులు సెల్‌ఫోన్ లైటింగ్‌తో అభిమానులు స్వాగతం పలికారు. ఇలా చవకబారు పనులతో వారి అభద్రతాభావాన్ని బయటపెట్టుకొన్నారు. త్వరలోనే ప్రజలు గొప్ప తీర్పు ఇవ్వనున్నారు. 2024లో పవన్ అసెంబ్లీలో అడుగుపెడుతారు. అక్కడ ఉన్నవారంతా బయటకు వస్తారు అని పృథ్వీ జోస్యం చెప్పారు.

    English summary
    30 year Industry Prudhvi Raj criticises Minster Roja Selvamani over remarks on Pawan Kalyan. He responded Jana vani' program conducted by Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X