For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bedurulanka 2012 సరికొత్తగా కార్తీకేయ.. క్రేజీ కాన్సెప్ట్‌తో బెదురులంక 2012 మోషన్ పోస్టర్

  |

  లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ హీరో కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం బెదురులంక 2012. సరికొత్త టైటిల్‌లో రిలీజ్‌కు ముందే సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్, టైటిల్ పోస్టర్‌కు స్పందన అద్బుతంగా కనిపించింది. ఇటీవల రిలీజ్ చేసిన ప్రీ-లుక్ అందర్నీ ఆకట్టుకొన్నది. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథ నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కార్తికేయ పాత్రతోపాటు స్ట్రాంగ్ కంటెంట్, కడుపుబ్బా నవ్వించే వినోదం సమపాళ్లలో ఉందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ క్రమంలో బెదురులంక 2012 మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ఎలా ఉందో.. మీరే చెప్పండి..

  Bedurulanka 2012 first look and Motion poster date released: Kartikeya Gummakonda looks promosing in his Character

  మోషన్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ "మోషన్ పోస్టర్ చూస్తే 'బెదురులంక 2012' ఎంత విభిన్నంగా ఉండబోతుందనేది అర్థం అవుతుంది. ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తీసిన చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. 'డీజే టిల్లు' తర్వాత నేహా నటిస్తున్న చిత్రమిది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందించారు. ఓ పాటను స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. కెమెరా వర్క్ సూపర్ అంటారంతా! ఆర్ట్ వర్క్ కూడా ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్ అవుతాయి. థియేటర్లలో ప్రేక్షకులను 'బెదురులంక' అనే కొత్త ప్రపంచంలోకి సినిమా తీసుకెళ్తుంది. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని చెప్పారు.

  దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ "డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ కనిపిస్తారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది" అని చెప్పారు.

  నటీనటులు: అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు

  రచన: దర్శకత్వం: క్లాక్స్
  నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని
  సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల
  సమర్పణ: సీ యువరాజ్
  యాక్షన్: అంజి, పృధ్వీ
  కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల
  పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ
  ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం
  సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య,
  ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల,
  ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా
  సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి,
  కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్
  సంగీతం: మణిశర్మ

  English summary
  Loukya Entertainments and Hero Kartikeya promises to bring out a crazy entertainer titled ‘Bedurulanka 2012’ starring ‘DJ Tillu’ fame Neha Sshetty as the female lead. The team started raising curiosity right from the beginning with the concept and title announcement poster earlier. Stirring the buzz on the caption ‘The Biggest Hoax Ever Played’, movie team has released a crazy first look and motion poster of hero from the movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X