అప్పుడే చెప్పా పెద్ద స్టార్ అవుతావని.. మామయ్య అంటూ ప్రేమగా.. రాఘవేంద్రరావు
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా బ్యానర్లపై అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'మహర్షి'. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. కమెడియన్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఆటపాటలతో వేదిక హోరెత్తింది. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడంతో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్పందించారు. హీరోగా తనతో తొలి చిత్రం సందర్బంగా చెప్పిన మాటలను గుర్తు చేసుకొన్నారు. ఆయన ఏమన్నారంటే
రాఘవేంద్రరావు మాట్లాడుతూ... మహేష్ బాబు 25 సినిమాలు పూర్తి చేసినందుకు ముందుగా థ్యాంక్స్. ఈ సందర్బంగా సూపర్ స్టార్ కృష్ణ అంటే మీ నాన్న ఎంత ఆనంద పడుతున్నారో అంతే సంతోషం నాకు కలుగుతున్నది. నాతో తొలి సినిమా చేసిన సమయంలో నీవు గొప్పస్టార్ అవుతావని నేను నీతో ఓ మాట చెప్పాను. నన్ను మామయ్య అంటూ పిలిచే వాడివి. అది నాకు ఎంతో ఇష్టం. నీవు మరింత ఎత్తుకు ఎదుగాలని కోరుకుంటూ నీకు ఆల్ ది బెస్ట్ అని అన్నారు.

మే 9వ తేదీన రిలీజ్ కానున్న మహర్షి సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలకు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.


Click it and Unblock the Notifications











