twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్వరలో సినీ, టెలివిజన్ షూటింగులకు అనుమతులు.. మంత్రి తలసాని స్పష్టీకరణ

    |

    సినిమా, టీవీ షూటింగ్‌లకు త్వరలోనే నిబంధనలతో కూడిన అనుమతుల మంజూరుకు తగు చర్యలు చేపట్టనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరులు, రూరల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సినీ, టీవీ రంగాలకు చెందిన వివిధ అసోసియేషన్ ల ప్రతినిధులతో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా, ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు చర్చలు జరిపారు. సినిమా, టీవీ షూటింగ్‌ల‌కు అనుమతులు, థియేటర్ల ఓపెనింగ్ తదితర అంశాలపై చర్చించారు.

    ఈ సమావేశంలో నటులు అక్కినేని నాగార్జున, దర్శకులు రాజమౌళి, ఎన్ శంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాతలు సీ కళ్యాణ్, కేఎస్ రామారావు, సురేష్ బాబు, మా అధ్యక్షులు నరేష్, అసోసియేషన్ ప్రతినిధులు దామోదర్ ప్రసాద్, సుప్రియ, టీవీ చానళ్ళ ప్రతినిధులు బాపినీడు, జెమిని కిరణ్, ఎగ్జిబిటర్స్ ప్రతినిధులు విజయేందర్ రెడ్డి, సునీల్ నారంగ్, తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మురళి మోహన్, ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ రాం మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

    Minister Talasani Srinivasa Yadav clarity on Movie, Television Shootings

    ఈ సందర్భంగా షూటింగ్ ప్రదేశాల్లో, థియేటర్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను వెల్లడిస్తూ మంత్రికి అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రాన్ని సమర్పించారు. అలాగే ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్టిస్టులకు ప్రయాణంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పాసులు మంజూరు చేయాలని కోరారు. రాత్రి వేళలో కర్ఫ్యూ అమలు చేస్తున్న కారణంగా షూటింగ్ ముగిసిన అనంతరం రాత్రి సమయాలలో ఆర్టిస్టులు, సిబ్బంది తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పోలీసుశాఖకు దరఖాస్తు చేస్తే ఈ పాస్‌లు మంజూరు చేయనున్నట్లు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రవిగుప్తా వివరించారు.

    థియేటర్లను ఓపెన్ చేసిన తర్వాత ఎదురయ్యే సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. షూటింగ్ జరిపే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన వ్యక్తిగత జాగ్రత్తలు, ఏర్పాట్లపై కూడా చర్చించడం జరిగింది. ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తామని సమావేశంలో పాల్గొన్న సినీ, టీవీ రంగ ప్రతినిధులు స్పష్టం చేశారు.

    మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సినిమా పరిశ్రమకు చెందిన ఏ విషయమైనా ప్రభుత్వం ఎప్పుడూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది. అసోసియేషన్ ప్రతినిధులు అందజేసిన సూచనలు, వినతులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోంటాం అని అన్నారు.

    సమావేశంలో షూటింగ్‌లకు అనుమతులు, థియేటర్ ఓపెనింగ్ అంశాలే కాకుండా సినిమా థియేటర్లకు ప్రత్యేక విద్యుత్ టారీఫ్, ఫ్లెక్సీ టికెటింగ్ ధరలు, అన్‌లైన్ టికెటింగ్ విధానం, కళాకారులకు పెన్షన్లు, తెల్ల రేషన్ కార్డులు తదితర అంశాలపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అంశాలను సినీ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం రూపొందిస్తున్న బెస్ట్ పాలసీ లో పొందుపరచడం జరుగుతుందని వివరించారు.

    English summary
    Minister Talasani Srinivasa Yadav meeting with Film makers on Wednes day. He said thatCM KCR given green Signal to Tollywood shootings within lockdown norms. Telangana Government has showed positive for Telugu Film Industry development
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X