Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘A1 ఎక్స్‌ప్రెస్’ ఫస్ట్ లుక్ రిలీజ్: తెలుగులోనే అలా వస్తున్న మొట్టమొదటి చిత్రం
'ప్రస్థానం' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఆ తర్వాత 'షోర్ ఇన్ ద సిటీ' అనే హిందీ చిత్రాన్ని కూడా చేశాడు. అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె.. సరైన హిట్ దొరకక ఇబ్బందులు పడుతున్నాడు. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సూపర్ హిట్ అయినప్పటికీ.. ఆ తర్వాత అతడు నటించిన ఎన్నో సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఈ క్రమంలోనే 'నిను వీడని నీడను నేనే'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ మూవీకి నిర్మాతగానూ వ్యవహరించిన సందీప్ లాభాలనూ అందుకుని సత్తా చాటాడు.
'నిను వీడని నీడను నేనే' తర్వాత 'తెనాలి రామకృష్ణ' అనే మూవీ చేసినా అది పెద్దగా సక్సెస్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయోగాత్మక చిత్రాలపై ఎక్కువ ఫోకస్ చేశాడు సందీప్ కిషన్. ఇందులో భాగంగానే డెన్నిస్ జీవన్ కనుకొలను తెరకెక్కిస్తోన్న 'A1 ఎక్స్‌ప్రెస్' అనే సినిమాలో నటిస్తున్నాడు. జాతీయ క్రీడ హాకీ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో అతడు ఆటగాడిగా కనిపించనున్నాడు. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెన్‌లతో కలిసి సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది.
తాజాగా విడుదలైన పోస్టర్లో సందీప్ కిషన్ షర్ట్ లేకుండా కనిపిస్తున్నాడు. అతడి చేతిలో ఇండియన్ జెర్సీతో పాటు హాకీ స్టిక్ ఉన్నాయి. విజయగర్వంతో హీరో ముఖం వెలిగిపోతోంది. ఈ పోస్టర్‌ను విడుదల చేస్తూ సందీప్ కిషన్.. 'మేము గర్వంగా తీస్తున్న డ్రీమ్ ప్రాజెక్టు ఇది. టాలీవుడ్లోనే మొట్టమొదటి హాకీ నేపథ్యంతో సాగే సినిమా. అలాగే, ఇది నా 25వ చిత్రం. మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మీకోసం' అంటూ ట్వీట్ చేశాడు. హిప్ఆఫ్ తమీజా సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో మురళీ శర్మ, రావు రమేష్, పోసాని కృష్ణ మురళీ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.