For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  విప‌త్క‌ర పరిస్థితుల్లో సందీప్ కిషన్ అట.. అయినా నిను వీడ‌ని నీడ‌ను నేనే అంటూ!

  |

  మ‌నిషి శ‌త్రువుతో యుద్ధం చేస్తే గెలుస్తాడు.. కానీ త‌న నీడ‌తోనే యుద్ధం చేయాల్సి వ‌స్తే.. ఎలా ఉంటుందో ఆలోచించండి.. అలాంటి విప‌త్క‌ర పరిస్థితులను ఎదుర్కొన్న ఓ యువ‌కుడు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఎలా స‌క్సెస్ అయ్యాడు అనేది తెలుసుకోవాలంటే నిను వీడ‌ని నీడ‌ను నేనే సినిమా చూడాల్సిందే అంటున్నారు యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్‌. ఈ హీరో న‌టిస్తోన్న ఎమోష‌న‌ల్ హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని క‌థాంశంతో రాబోతున్న చిత్ర‌మిది.ఈ సినిమా గురించి మరిన్నీ వివరాలు

  తుది దశకు మూవీ షూటింగ్

  తుది దశకు మూవీ షూటింగ్

  వెంక‌టాద్రి టాకీస్‌, విస్తా డ్రీమ్ మ‌ర్చంట్స్ ప‌తాకాల‌పై కార్తీక్ రాజు ద‌ర్శ‌క‌త్వంలో ద‌యా ప‌న్నెం, వి.జి.సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాత‌లుగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న చిత్రం `నిను వీడ‌ని నీడ‌ను నేనే`. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది.

  ఎవరూ టచ్ చేయని పాయింట్ అని

  ఎవరూ టచ్ చేయని పాయింట్ అని

  ఈ సంద‌ర్భంగా ...ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు మాట్లాడుతూ - ``ఒక కొత్త పాయింట్ తీసుకుని ఎమోష‌న‌ల్ హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని డిఫ‌రెంట్ పాయింట్‌తో, ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో సినిమాను రూపొందిస్తున్నాం. సందీప్ కిష‌న్ తొలిసారి న‌టిస్తోన్న హార‌ర్ చిత్ర‌మిది. మ‌నిషి శత్రువుతో యుద్ధం చేస్తాడు కానీ.. మ‌నిషి త‌న నీడ‌తోనే యుద్ధం చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తే ఎలా ఎదుర్కొన్నాడ‌నేదే పాయింట్‌. ఈ సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్‌ను హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌రిస్తున్నారు. హీరో హీరోయిన్ ల పై కొన్ని కీలక సన్నివేశాలు ఒక ముఖ్యమైన పోరాట సన్నివేశం చిత్రీకరించనున్నారు దీంతో సినిమా పూర్తవుతుంది`` అన్నారు.

   ఫిబ్రవరిలో రిలీజ్

  ఫిబ్రవరిలో రిలీజ్

  నిర్మాత ద‌యా ప‌న్నెం మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు కార్తీక్ సినిమాను అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం పూర్తి చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఫిబ్ర‌వ‌రిలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  న‌టీన‌టులు:

  సందీప్ కిష‌న్‌,
  అన్య సింగ్
  , పోసాని కృష్ణ ముర‌ళి,
  ముర‌ళీ శ‌ర్మ‌,
  వెన్నెల‌కిషోర్‌,
  రాహుల్ రామ‌కృష్ణ‌
  , పూర్ణిమ భాగ్య‌రాజ్‌, ప్ర‌గ‌తి

  తదితరులు

  సాంకేతిక నిపుణులు:


  నిర్మాత‌లు: ద‌యా ప‌న్నెం, వి.జి.సుబ్ర‌హ్మ‌ణ్య‌న్‌
  ,
  ద‌ర్శ‌క‌త్వం: కార్తీక్ రాజు

  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: శివా చెర్రీ, సీతారాం, కిరుబాక‌ర‌న్‌

  సినిమాటోగ్ర‌ఫీ: ప‌్ర‌మోద్ వ‌ర్మ‌

  సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

  ఎడిట‌ర్‌: కె.ఎల్‌.ప్ర‌వీణ్‌

  ఆర్ట్‌: విదేశ్‌

  పి.ఆర్‌.ఒ: నాయుడు - ఫ‌ణి

  English summary
  Sundeep Kishan is producing this novel movie on Venkatadri Talkies (Production No. 1) in association with Vista Dream Merchants. Directed by Caarthick Raaju, the actor is paired up with Anya Singh in this entertainer. "We are dealing with a new point in the movie. The last schedule is being shot in Hyderabad. Certain crucial scenes are being shot on the lead pair. An important action sequence is also part of the schedule. The film has shaped up so well," says director Caarthick Raaju, adding that his movie will tell a supernatural story. High technical values are its forte. Producers Daya Pannem and VG Subrahmanyan are happy that the production works have been going on as per schedule. The film is being made simultaneously in Telugu and Tamil.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more