అమీర్ ఖాన్ సంసారంలో 16 ఏళ్ల చిచ్చు.. ఇద్దరు భార్యలకు సేమ్ టూ సేమ్ విడాకులు!

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ వైవాహిక జీవితం రెండోసారి భగ్నమైంది. ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఇద్దరు భార్యలకు విడాకులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. వ్యక్తిత కారణాల వల్ల ఇద్దరు భార్యల నుంచి ఫ్రెండ్లీగానే ఆయన దూరం కావడం ఎలాంటి వివాదాలు చోటుచేసుకొన్నలేదు. కానీ అమీర్ ఖాన్ దాంపత్య జీవితంలో 16వ ఏడు కలిసి రాలేదనే చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

సాధారణంగా ఏడో సంవత్సరం..

సాధారణంగా ఏడో సంవత్సరం..

సాధారణంగా ఎవరి దాంపత్య జీవితంలోనైనా ఏడో సంవత్సరం చిచ్చు పడుతుందనే విషయాన్ని పెద్దలు చెబుతుంటారు. సంసారం జీవితం ఏడో ఏట అడుగు పెట్టగానే భర్తపై భార్యనో లేదా భార్యపై భర్తనో ఆకర్షణ కోల్పవడం ద్వారా వారి సంసారాల్లో చిచ్చు రేగుతుందనే, అది విడాకులకు దారి తీస్తుందని చెబుతుంటారు. కానీ అమీర్ ఖాన్ విషయంలో 16వ సంవత్సరం మాత్రం చిచ్చు పెట్టింది.

అమీర్ ఖాన్‌తో రీనా దత్తా పెళ్లి

అమీర్ ఖాన్‌తో రీనా దత్తా పెళ్లి

అమీర్ ఖాన్ వైవాహిక జీవితం విషయానికి వస్తే.. రీనా దత్తా టాప్ హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలోనే మనసు పడ్డాడు. రీనా, అమీర్ ఖాన్ ఇద్దరూ ఇరుగుపొరుగు వారు కావడంతో మరింత దగ్గరయ్యారు. కానీ రీనా దత్తా మాత్రం అమీర్ ఖాన్ లవ్ ప్రపోజల్‌ను పలుమార్లు తిరస్కరించింది. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ఆమె ప్రేమ కోసం పరితపించాడు.

16వ ఏట అమీర్ ఖాన్ విడాకులు

16వ ఏట అమీర్ ఖాన్ విడాకులు

అమీర్ ఖాన్ తన ప్రయత్నాన్ని విరమించకుండా రీనా దత్తాను వెంటడించి 1986లో పెళ్లి చేసుకొన్నాడు. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల.. వారి దాంపత్య జీవితంలో ఎలాంటి అపోహాలు, అనుమానాలు రాలేదు. కానీ 2002లో వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకొన్నారు. దాదాపు వారిద్దరు 16 ఏళ్లపాటు వైవాహిక జీవితాన్ని అనుభవించారు.

కిరణ్ రావుతో 16వ ఏటనే సెపరేషన్

కిరణ్ రావుతో 16వ ఏటనే సెపరేషన్

ఇక మూడేళ్ల గ్యాప్ అనంతరం తన సినిమా లగాన్‌కు అసిస్టెంట్‌గా పనిచేసిన కిరణ్ రావుతో ప్రేమ వివాహం జరిగింది. వారిద్దరూ 2005లో వివాహం చేసుకొన్నారు. అమీర్ ఖాన్ ప్రొఫెషనల్ జీవితంలో కూడా కిరణ్ రావు కీలక పాత్ర పోషించారు. తమ జీవితానుబంధంలో ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారు. అయితే వారిద్దరి మనస్పర్దలు రావడంతో 2021లో విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు. సరిగ్గా అమీర్ ఖాన్ జీవితంలో 16వ ఏటనే ఈ సంఘటన చోటుచేసుకొన్నది.

అమీర్ ఖాన్ సంతానం.. వారి బాధ్యతలు

అమీర్ ఖాన్ సంతానం.. వారి బాధ్యతలు

ఇక అమీర్ ఖాన్, రీనా దత్తా విడిపోయే సమయానికి వారిద్దరికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఇరా ఖాన్, జునైద్ ఖాన్ ఇద్దరూ తల్లి పెంపకంలోనే ఉన్నారు. ఇక కిరణ్ రావు, అమీర్ ఖాన్ దంపతులకు సరోగసి ద్వారా కలిగిన బిడ్డ ఆజాద్ ఉన్నాడు. ప్రస్తుతం ఆజాద్ ఆలనాపాలనను ఇద్దరు కలిసి చూసుకోవాలని నిర్ణయం తీసుకొన్నట్టు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X