twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోనూసూద్ న్యూ రికార్డ్.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా పెరిగిన ఫాలోయింగ్!

    |

    గత ఏడాది నుంచి ఇండియాలో ఎక్కువగా రియల్ హీరో అనే ట్యాగ్ తో పిలిపించుకుంటున్న సోనూసూద్ సోషల్ మీడియాలో మరో ఘనత సాధించాడు. గత ఏడాది కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి కూడా సోనూసూద్ చాలామందికి సహాయాన్ని అంధించాడు. లాక్ డౌన్ వలన రోడ్డు బాట పట్టిన ఎంతోమంది వలసదారులను సొంత ఊళ్లకు చేర్చాడు. అంతే కాకుండా ఎంతోమంది ఆకలి తీర్చాడు.

    పేద విద్యార్థులకు సహాయం చేయడమే కాకుండా ఎంతోమంది రైతులకు కూడా అండగా నిలిచారు. సహాయం ఏలాంటిదైనా సరే సోనూసూద్ తన సొంత ఖర్చులతో చేసుకుంటూ వచ్చాడు. అనంతరం సోనూసూద్ కోసం మద్దతుగా నిలిచిన సినీ తారలు ప్రముఖులు అలాగే సాదారణ ప్రజలు కూడా వారికి తోచినంత విరాళాలు అందించారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా సోనూసూద్ సహాయలు చేసుకుంటూ వచ్చారు. ఎక్కువశాతం ట్విట్టర్ ద్వారానే సహాయలు చేసుకుంటూ వచ్చారు.

    Actor Sonu sood new record in twitter world

    ఇక లాక్ డౌన్ కంటే ముందు వరకు సోషల్ మీడియాలో సోనూసూద్ కు పెద్దగా ఫాలోవర్స్ ఏమి లేరు. ఇక ఎప్పుడైతే అతను సహాయలు చేయడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువయ్యింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా రోగులకు ఆక్సిజన్ సిలిండర్స్ అందించాలని ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా నిర్మించారు. దీంతో ఆయన ట్విట్టట్ ఫాలోవర్స్ సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది. ఇటీవల 8 మిలీయన్ ఫాలోవర్స్ మార్క్ ను అందుకున్నాడు. ప్రస్తుతం సోనూసూద్ పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక భవిష్యత్తులో కూడా తన సహాయలు కొనసాగుతూనే ఉంటాయని సోనూసూద్ వివరణ ఇవ్వడం గొప్ప విషయం.

    English summary
    Sonu Sood did not have a large following on social media until before the lockdown. The number of followers has increased since he started helping. Oxygen plants were also built to provide oxygen cylinders to corona patients across the country. With this, the number of his Twitter followers has increased exponentially. Recently received the 8 million followers mark.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X