Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్టుపిడ్.. ఇడియెట్లం కాదు.. వారికే అవసరం.. ఫిలింఫేర్ అవార్డులపై సల్మాన్ ఖాన్ ఫైర్
ఏటా జరిగే ఫిలింఫేర్ అవార్డుల తంతుపై ఎప్పటిలానే వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఘాటుగా స్పందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రతిభావంతులైన నటులను పక్కన పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో పాత వీడియోలో సల్మాన్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. ఇంతకు బాలీవుడ్ కండల వీరుడు ఏం మాట్లాడారంటే....
ఫిలింఫేర్, ఇతర అవార్డులపై విముఖత
ఫిలింఫేర్ అవార్డులపై విముఖత వ్యక్తం చేస్తూ నేను ఎప్పుడూ అలాంటి అవార్డును తీసుకోవడానికి వెళ్లను అంటూ సల్మాన్ ఖాన్ ఘాటుగా స్పందించాడు. ఎవరికైతే తన మీద తనకు నమ్మకం ఉండదో.. అలాంటి వాళ్లకు అవార్డులు అవసరం. ఫిలింఫేర్ గానీ,, ఇతర స్టుపిడ్ అవార్డులను తీసుకోవడానికి వెళ్లను. జాతీయ అవార్డు వస్తే అది నాకు ప్రతిష్టాత్మకం. దానిని తీసుకోవడానికి వెళ్తాను అని సల్మాణ్ అన్నారు.
మ్యాగజైన్లు ఇచ్చే అవార్డులపై
కొన్ని మ్యాగజైన్లు ఇచ్చే అవార్డులపై సల్మాన్ ఖాన్ ధ్వజమెత్తారు. సినీ స్టార్లు, ప్రముఖుల వల్లే మ్యాగజైన్లు నడుస్తాయి. సినీ తారలు ఇచ్చే ఇంటర్వ్యూల వల్లే వారి పత్రికల మనగడ ఉంటుంది. అలాంటి వాళ్లు పిలిచి మీకు అవార్డులు ఇస్తామంటారు. దానికోసం మనల్ని వచ్చి స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేయాలంటారు.
|
ఇడియెట్స్ మాదిరిగా సూట్ బూట్లు
అవార్డులు ఇచ్చే నిర్వాహకులు ఆ తర్వాత పాన్ పరాగ్, మాణిక్ చంద్‌తో ఒప్పందాలు చేసుకొంటారు. మనం ఇడియెట్ల మాదిరిగా సూటు బూట్లు వేసుకొని అవార్డులు తీసుకొంటుంటాం అని మరింత ఘాటుగా స్పందించారు. రేపటి రోజున నా డ్రైవరో లేదా స్పాట్ బాయ్, మేకప్ మ్యాన్ పిలిచి మనకు అవార్డులు ఇస్తామని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి స్టుపిడ్ వ్యవహారాలు చూడాల్సి కూడా వస్తుంది అని సల్మాన్ మండిపడ్డారు.
వివాదం రాజేసిన గల్లీభాయ్
తాజాగా జరిగిన ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో గల్లీభాయ్ చిత్రానికి 13 కేటగిరిల్లో అవార్డులు రావడం వివాదంగా మారింది. ఈ క్రమంలో పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అంతేకాకుండా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమా కోసం బెస్ట్ డెబ్యూ ఫీమేల్ అవార్డును అనన్య పాండేకి ఇవ్వడం కూడా విమర్శలు చెలరేగుతున్నాయి.
Recommended Video
సల్మాన్ ఖాన్ వీడియోపై మిశ్రమ స్పందన
ప్రస్తుతం వైరల్‌గా మారిన సల్మాన్ ఖాన్ వీడియోపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. అవార్డుల ప్రహసనంపై తమ హీరో అసహనం వ్యక్తం చేయడంపై అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. స్టేజీ మీద ఖాన్స్ సినిమా పాటలపై ఉంటాయి. అవార్డులు మాత్రం అక్షయ్, రణ్‌బీర్‌కు ఇస్తారు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.