twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa Day 1 collections: అక్కడ టాలీవుడ్ చరిత్రలోనే మొట్ట మొదటి సారి.. ఏరియా వారీగా కలెక్షన్స్ రిపోర్ట్!

    |

    కాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్‌ టాక్‌తో మున్ముందుకు వెళ్తోంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా కొంత మేరకు నిడివి ఎక్కువగా ఉందనే టాక్ వినిపిస్తున్నా ఓవరాల్ గా అయితే ఆకట్టుకుంది. బన్నీ కెరీర్‌లో ఎప్పడూ లేని విధంగా పుష్ప సినిమా భారీ ఎత్తున రిలీజైంది. అయితే ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్లు ఏమేరకు వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..

    3000 పైగా థియేటర్లలో

    3000 పైగా థియేటర్లలో

    ఆర్య, ఆర్య 2 తరువాత బన్నీ సుక్కు కాంబినేషన్ సినిమా కావడం, రంగస్థలం తర్వాత సుకుమార్, అల వైకుంఠపురం తర్వాత అల్లు అర్జున్ నటించిన సినిమా కావడంతో ఫుష్ప సినిమా రిలీజ్‌కు ముందు భారీ అంచనాలతో వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినిమా అత్యధిక థియేటర్లలో రిలీజైంది. నైజాం, ఆంధ్రాలో కలిపి 1150 థియేటర్లలో రిలీజ్ అయింది. అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీలో కలిపి సుమారు 1200 థియేటర్లలో, ఓవర్సీస్లో 600 థియేటర్లలో రిలీజైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3000 పైగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    భారీ స్పందన

    భారీ స్పందన


    అల్లు అర్జున్ హీరోగా రష్మిక హీరోయిన్ గా నటించిన సినిమా పుష్ప. అనసూయ, సునీల్, ఫాహద్ ఫాజిల్, రావు రమేష్, అజయ్ ఘోష్ వంటి వారు కీలా పాత్రలలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సినిమాకు తొలి రోజు నుంచే థియేటర్‌లలో హౌస్ ఫుల్ బోర్డులు భారీగానే పడ్డాయి. నైజాంలోని ప్రతీ చోట సగటున 90 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అలాగే ఆంధ్రాలో కూడా భారీ స్థాయిలో ఆక్యుపెన్సీ కనిపించింది. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ నుంచే భారీ స్పందన, కనిపించింది. దీంతో పుష్ప సినిమా తొలి రోజు వసూళ్లన్నీ ఒక రేంజ్ లో వచ్చాయి.

    ప్రీ రిలీజ్ బిజెనెస్ విషయానికి వస్తే

    ప్రీ రిలీజ్ బిజెనెస్ విషయానికి వస్తే

    ఫుష్ప సినిమా ప్రీ రిలీజ్ బిజెనెస్ విషయానికి వస్తే.. నైజాంలో 36 కోట్లు, సీడెడ్‌లో 18 కోట్లు, ఉత్తరాంధ్రలో 12.25 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా 8 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా 7 కోట్లు, గుంటూరు జిల్లాలో 9 కోట్లు, కృష్ణా జిల్లా రూ.7.5 కోట్లు, నెల్లూరు రూ.4 కోట్లు నమోదైంది. ఓవరాల్‌గా ఏపీ, తెలంగాణలో కలిపి 101 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటకలో 9 కోట్లు, హిందీలో 10 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో 13 కోట్ల మేర బిజినెస్ జరిగింది.అలా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 145 కోట్ల మేర బిజినెస్‌తో రంగంలోకి దిగింది.

    నైజాంలో రికార్డు బ్రేక్

    నైజాంలో రికార్డు బ్రేక్

    పుష్ప సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో నైజాం : 11.44 కోట్లు, సీడెడ్: 4.20 కోట్లు, ఉత్తరాంధ్ర: 1.8 కోట్లు, ఈస్ట్ : 1.43 కోట్లు, వెస్ట్: 1.5 కోట్లు, గుంటూరు: 2.28 కోట్లు, కృష్ణా 1.15 కోట్లు, నెల్లూరు: 1.10 కోట్లు సంపాదించింది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 24.90 కోట్ల షేర్, 35.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.అలా పుష్ప సినిమా ఇప్పటి దాకా నైజాం లో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. మొత్తం మీద నైజాంలో 11.44 కోట్ల రూపాయల షేర్ సాధించింది. అయితే సినిమా విడుదల ముందు రోజే టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవచ్చని చెప్పడంతో టికెట్ రేట్లు కూడా ఆల్ టైం హై అని చెబుతున్నారు.

    మిగతా చోట్ల ఏంటంటే

    మిగతా చోట్ల ఏంటంటే

    పుష్ప అమెరికా కలెక్షన్స్ విషయానికి వస్తే అక్కడ ప్రీమియర్స్, మొదటి రోజు కలెక్షన్స్ కలిపి ఇప్పటిదాకా 893 వేల డాలర్లు అంటే సుమారు 6.78 కోట్లు సాధించింది. హిందీ విషయానికి వస్తే 3.05 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక తమిళనాడులో కూడా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సంపాదించింది. తమిళనాడులో మొదటిరోజు 3.65 కోట్లు కలెక్షన్ చేసింది ఈ సినిమా. కర్ణాటకలో 6.72 కోట్లు సాధించింది. కానీ రెండు తెలుగు రాష్టాల ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో మాత్రం పదో స్థానంలో నిలిచింది.

    English summary
    Allu Arjun's Pushpa Day 1 World wide collections report, as per Trade analysts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X