»   » ‘బాహుబలి’తెలుగు వెర్షన్ క్లోజింగ్ బిజినెస్ డిటేల్స్...

‘బాహుబలి’తెలుగు వెర్షన్ క్లోజింగ్ బిజినెస్ డిటేల్స్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి'. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది. రూ. 600 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

విడుదలవడమే భారీగా విడుదలైన ఈచిత్రం 50 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితం అయి కలెక్షన్ల సునీమీ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయింది. దర్శకుడు రాజమౌళి కూడా రికార్డుల కోసం సినిమాను ఎక్కువ రోజులు నడిపించాలనే ఉద్దేశ్యం తమకు లేదని, కలెక్షన్లు వచ్చే కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శిస్తామని గతంలోనే ప్రకటించారు.


తెలుగులో ‘బాహుబలి' మూవీ బిజినెస్ పూర్తవడంతో కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి. ఒక తెలుగు వెర్షన్ చిత్రమే రూ. 172 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. తెలుగులో సినిమా చరిత్రలో ఈ రేంజిని అందుకునే సత్తా త్వరలో రాబోయే ‘బాహుబలి-2' సినిమాకు తప్ప మరే సినిమాకు లేదని చెప్పడంలో సందహం లేదు.


'Baahubali' closing business

బాహుబలి తెలుగు వెర్షన్ క్లోజింగ్ బిజినెస్ వివరాలు ఏరియా వైజ్...


నైజాం: రూ. 42.00 కోట్లు


సీడెడ్ : రూ. 22.10 కోట్లు


నెల్లూరు రూ. 4.10 కోట్లు


కృష్ణ : రూ. 6.77 కోట్లు


గుంటూరు: రూ. 9.75 కోట్లు


వైజాగ్: రూ. 9.52 కోట్లు


ఈస్ట్ గోదావరి: రూ. 8.70 కోట్లు


వెస్ట్ గోదావరి: రూ. 6.75 కోట్లు


ఏపి, తెలంగాణ ఫుల్ రన్ షేర్: రూ. 109.69 కోట్లు


కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 34.15 కోట్లు


ఓవర్సీస్: 28.30 కోట్లు


ఫుల్ రన్ వరల్డ్ వైడ్ షేర్: రూ. 172.14 కోట్లు

English summary
Young Rebel Star Prabhas' 'Baahubali's Telugu version collected a share of Rs.172.14 crores share at the end of its full run world wide. Given below is the area wise break up of shares.
Please Wait while comments are loading...