twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Liger నష్టాలతో సెటిల్మెంట్స్ స్టార్ట్.. పూరి జగన్నాథ్ ఎంత వెనక్కి ఇస్తున్నారంటే?

    |

    టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా విడుదలకు మందు ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమా విడుదల తర్వాత ఊహించిన విధంగా డిజాస్టర్ టాక్ అందుకొని బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నష్టాలను కలుగజేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో నష్టాలను కలుగజేసినట్లు సమాచారం. అయితే పూరి జగన్నాథ్ ఇప్పుడు కొన్ని ప్రధాన ఏరియాలలో నష్టాల బారినపడిన డిస్ట్రిబ్యూటర్లకు కొంత డబ్బును వెనక్కి తిరిగి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    విజయ్ హార్డ్ వర్క్

    విజయ్ హార్డ్ వర్క్

    డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని చేసిన చిత్రం లైగర్ ఆగస్టు 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. సినిమాలో అతని నటన యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా హైలెట్ గా నిలిచాయి. ఓ వర్గం ప్రేక్షకులను అయితే విజయ్ దేవరకొండ బాగానే కట్టుకున్నాడు.

    బాక్సాఫీస్ టార్గెట్

    బాక్సాఫీస్ టార్గెట్

    అయితే లైగర్ సినిమా పూర్తిస్థాయిలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆ ప్రభావం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా చూపించింది. ఊహించిన విధంగా చాలా ఏరియాలలో ఈ సినిమా భారీ నష్టాలను కలుగజేసినట్లు సమాచారం. ఇక విడుదలకు ముందు మంచి హైప్ ఉన్నందున వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 88.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 90 కోట్ల టార్గెట్ తో మార్కెట్లోకి వచ్చింది.

     వచ్చింది ఎంత?

    వచ్చింది ఎంత?

    ఇక మొత్తంగా అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కేవలం 13 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో అయితే 1.50 కోట్లు రాగా మిగతా భాషలో 82 లక్షలు వచ్చింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే పరవాలేదు అనే విధంగా 7.70 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో మూడు కోట్లు రాగా మొత్తంగా వరల్డ్ వైడ్ గా 28 కోట్ల వరకు ఈ సినిమా షేర్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం.

     నష్టాలు ఏ రేంజ్ లో అంటే..

    నష్టాలు ఏ రేంజ్ లో అంటే..

    తెలుగులో ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న కొంతమంది బయ్యర్లు ఊహించిన విధంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. అయితే పూరి జగన్నాథ్ ఎక్కువగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఆదుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఓవరాల్ గా అయితే సినిమా బిజినెస్ ను బట్టి దాదాపు 55 కోట్ల రేంజ్ లోనే నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది.

     ఆంధ్ర, సీడెడ్

    ఆంధ్ర, సీడెడ్

    అయితే పూరి జగన్నాథ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో నష్టపోయిన కొంతమంది డిస్ట్రిబ్యూటర్లతో ఇటీవల మాట్లాడినట్లు సమాచారం. ఇక అందులో ఎక్కువగా ఆంధ్ర ఏరియాలో నష్టపోయిన వారికి దాదాపు 6 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సీడెడ్ లో కూడా నష్టాలు రాగా అక్కడ 2.25 కోట్ల వరకు వెనక్కి ఇచ్చినట్లు సమాచారం.

    నైజాం ఏరియా..

    నైజాం ఏరియా..

    ఇక విజయ్ దేవరకొండకు చాలా బలమైన మార్కెట్ ఉన్న నైజాం ఏరియాలో కూడా లైగర్ కొంత నష్టాలను కలుగజేసింది. నైజాం హక్కులను వరంగల్ శ్రీను దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే అతనికి 4.5 కోట్లు వెనక్కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నైజాం ఏరియాలో లైగర్ సినిమా దాదాపు 25 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం తెలిసిందే.

    English summary
    Director puri Jagannath discussion on liger movie losses settlements latest details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X