twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కిల్లింగ్‌ వీరప్పన్‌': ఈ రోజు రిలీజ్ కాదు...మారింది

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ఈరోజు రిలీజ్ అవ్వాల్సిన రామ్ గోపాల్ వర్మ సినిమా 'కిల్లింగ్ వీరప్పన్' అగిపోయింది. దీనికి కారణం స్మగ్లర్ వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి కోర్టు పిటీషన్. అయితే చివరి నిముషాల్లో వీరప్పన్ భార్య ముత్తు లక్ష్మి వలన ఏర్పడిన సమస్యలను సెట్ చేసుకున్నారు. ఈ చిత్రం విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగించుకుని ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైనట్లు వర్మ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.

    సమస్య ఏమిటంటే..

    'కిల్లింగ్‌ వీరప్పన్‌'. ఈ చిత్రం విడుదలకు దగ్గరైన ఈ సమయంలో ఊహించని అడ్డంకి తగిలింది. తమ అనుమతిలేనిదే 'కిల్లర్ వీరప్పన్' సినిమా విడుదల చేయరాదని వీరప్పన్ సతీమణి ముత్తులక్ష్మి డిమాండ్ చేశారు.

    ఆమె మాట్లాడుతూ... కిల్లర్ వీరప్పన్ సినిమాను హిందీలో తెరకెక్కించడానికి మాత్రమే తన నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనుమతి పొందారని చెప్పారు. అయితే కన్నడ, తమిళ భాషల్లో సినిమా తీయడానికి అనుమతి పొందలేదని ఆమె స్పష్టం చేశారు. కిల్లర్ వీరప్పన్ సినిమాను హిందీ, తమిళ భాషల్లో మాత్రమే విడుదల చేయాలన్నారు.

    అదికూడా మొదట తాను కిల్లర్ వీరప్పన్ చిత్రం చూసిన తరువాతేనే ఆ సినిమా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కిల్లర్ వీరప్పన్ అనే సినిమా టైటిల్ అభ్యంతరంగా ఉందని ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు వీరప్పన్ ను అవహేళనగా చూపించినట్లు తెలుస్తోందన్నారు.

    Killing Veerappan :RGV announcing new date.

    ఈ సినిమాలో వీరప్పన్ ను చెడుగా చూపించినట్లైతే ఆ ప్రభావం కుటుంబ సభ్యులపై పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కిల్లర్ వీరప్పన్ సినిమాను అడ్డుకోవడానికి కోర్టు అనుమతి పొందామని తెలిపారు.

    2006 సంవత్సరంలోనే రూ. 31 లక్షలు ముత్తులక్ష్మికి అందించి కిల్లర్ వీరప్పన్ సినిమా హక్కులు పొందామని అట్టహాస కన్నడ సినిమా డైరెక్టర్ ఎ.ఎమ్.రమేశ్ తెలిపారు. కన్నడ, తమిళ భాషల్లో కిల్లర్ వీరప్పన్ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేసే సమయంలో కేసు పెట్టి ఇలా అడ్డంకులు సృష్టించడం విడ్డూరంగా ఉందని రమేశ్ వాపోయారు.

    కన్నడ హీరో శివరాజ్ కుమార్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. పరుల్ యాదవ్, యజ్ఞ శెట్టి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన సందీప్ భరద్వాజ్ వీరప్పన్ పాత్ర పోషిస్తున్నాడు.

    English summary
    "Killing Veerappan" on December 4th got stalled by Veerappan's wife Muthulakshmi. now RGV tweeted: "Problems with Mutthulakshmi regarding Killing Veerapan have been amicably settled ..Film is releasing on 11th December", , clarifying on the issue and announcing new date.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X