twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ 'కెమెరామేన్ గంగతో..' మరో కొత్త రికార్డు

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. గబ్బర్ సింగ్ ఘన విజయంతో ఈ చిత్రం బిజినెస్ మంచి క్రేజ్ తో జరిగింది. ముఖ్యంగా ఈ చిత్రం యు.ఎస్ లో ఓ కొత్త రికార్డుని క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాత డివివి దానయ్య స్వయంగా మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..తాను యు.ఎస్ లో ఈ చిత్రాన్ని స్వయంగా రిలీజ్ చేస్తున్నానని, అక్కడ $ 260 k కి పదమూడు సెంటర్లు అమ్ముడుపోయిందని అన్నారు. ఇది యుఎస్ లో ఓ తెలుగు చిత్రానికి వచ్చిన హైయిస్ట్ ప్రైస్ అని ఇప్పటివరకూ ఈ రేంజి బిజినెస్ ఏ చిత్రానికి జరగలేదని అన్నారు.

    తాను పవన్ కళ్యాణ్ సినిమాకు అమెరికాలో వస్తున్న ఈ క్రేజ్ కు చాలా ఆశ్చర్యపోయానని అన్నారు. ఇప్పటికి రోజూ చాలా బిజినెస్ కాల్స్ వస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోందని,అక్టోబర్ 11 న చిత్రం విడుదల చేస్తామని అన్నారు. అలాగే సెప్టెంబర్ మూడవ వారంలో ఆడియోని రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ చిత్రం పవర్ స్టార్ స్టామినాని భాక్సాఫీస్ వ్దద మరోసారి పునర్ నిర్వచిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

    బ్లూ స్కై ద్వారా అమెరికాలో 'కెమెరామేన్ గంగతో రాంబాబు' విడుదల అవుతోంది. కలర్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ వారు యూరప్, యూకే రైట్స్ తీసుకున్నారు. కేవలం యుకె రైట్స్ కే ముప్పై లక్షలు చెల్లించినట్లు సమాచారం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రైట్స్ ని ముప్పై లక్షలకు ఫ్యాన్సీ రేటు ఇచ్చి ఇలిక్లయిర్ ఇండియా ఎంటర్టైన్మెట్స్ వారు తీసుకున్నారు. గల్ఫ్, కువైట్ రైట్స్ ని నలభై లక్షలకు, జానకీ రత్న కుమార్ రెడ్డి తీసుకున్నారు.

    పవన్ కళ్యాణ్, తమన్నా, గేబ్రియేల్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో-డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి దానయ్య, కథ-స్క్ర్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    
 Pawan Kalyan's upcoming film Cameraman Gangatho Rambabu has set a new record in USA. The film's producer DVV Danayya, who is also releasing the movie in the US, said that the film was sold for a $ 260 k in 13 centres. This is a new record and is also the highest price for a Telugu film to be released in USA. Danayya said that the craze for Pawan is unmatched in USA and he was totally surprised to see the demand. He further adds that the production house has been getting calls from several exhibitors of other regions for screening the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X