Don't Miss!
- News రాహుల్ సహా నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్న కీలక నేతలు వీరే..
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
RRR అప్డేట్: ఎంటరవుతున్న ఆలియా.. రామ్ చరణ్‌తో రొమాన్స్‌కి లైన్ క్లియర్
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న RRR మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది మెగా, నందమూరి అభిమాన లోకం. కరోనా కారణంగా ఈ పరిస్థితుల్లో కొంతకాలం షూటింగ్ వాయిదా వేసిన చిత్రయూనిట్.. తదుపరి షెడ్యూల్ కోసం ప్రిపేర్ అవుతోందట. ఆ షెడ్యూల్లో హీరోయిన్ ఆలియా కూడా ఎంటర్ కాబోతోందట. పూర్తి వివరాల్లోకి పోతే..
Recommended Video
రౌద్రం రణం రుధిరం
ఇటీవలే RRR టైటిల్ సీక్రెట్ రివీల్ చేస్తూ 'రౌద్రం రణం రుధిరం' అని అధికారికంగా ప్రకటించారు యూనిట్ సభ్యులు. ఈ మేరకు విడుదల చేసిన మోషన్ పోస్టర్ మెగా, నందమూరి అభిమానులకు స్పెషల్ కిక్కివ్వడమే గాక, అందరిలోనూ ఆతృతను పెంచేసింది.
మెగా అభిమానుల్లో జోష్.. హీరో ఎంట్రీ
ఇక ఈ భారీ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజు పాత్ర పోషిస్తున్నారు. చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా రీసెంట్ గా అల్లూరి సీతరామరాజుగా చరణ్ ఎంట్రీ వీడియోను విడుదల చేసి మెగా అభిమానుల్లో జోష్ నింపారు.
యంగ్ హీరోలు.. అందాల భామలు
ఇకపోతే ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటించనుంది. అయితే అనుకోకుండా ఈ ప్రాజెక్టు నుంచి ఆలియా తప్పుకుందని వార్తలు రావడంతో.. అందులో నిజం లేదని యూనిట్ స్పష్టం చేసింది.
ఎంటవుతున్న ఆలియా..
కరోనా కట్టడిలో భాగంగా పెట్టిన లాక్ డౌన్ ఫినిష్ కాగానే RRR తదుపరి షెడ్యూల్ షూటింగును పూణేలో ప్లాన్ చేశారు మేకర్స్. మే నెలలో ఈ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లోనే ఆలియా సెట్స్ మీదకు ఎంటర్ కానుందట. రామ్ చరణ్ - అలియా భట్ కాంబినేషన్లో ఓ పాటతో పాటు కొన్ని ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ అక్కడ జరగనున్నట్లు సమాచారం.