అల్లు అర్జున్ - కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న సినిమాపై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఆ కథ ఎలా ఉంటుందనే విషయంపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా కాన్సెప్ట్ పైనే అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి. తప్పకుండా సినిమా కాన్సెప్ట్ అయితే సామాజిక అంశంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
కమర్షియల్ హీరోతో మంచి సందేశాత్మక సినిమాలను చేయగల దర్శకుడు కొరటాల శివ అల్లు అర్జున్ లాంటి బడా హీరోతో మొదటిసారి చేస్తున్న సినిమా కాబట్టి గత సినిమాల కంటే హై రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఇక సినిమాలో ముఖ్యంగా మంచి నీటికి సంబంధించిన అంశంపై కథ నడుస్తుందట. మంచి నీళ్ల విలువ తెలిసేలా మరోసారి స్ట్రాంగ్ మెస్సేజ్ ఇవ్వడానికి కొరటాల పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీతో సిద్ధమైనట్లు సమాచారం. అలాగే పొలిటికల్ యాంగిల్ కూడా ఉంటుందట.
ఇక సినిమాని సెప్టెంబర్ లో స్టార్ట్ చేయవచ్చని టాక్ వస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ తో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమాతో రెడీ అవుతున్నాడు. ఆగస్ట్ సమయానికి ఇద్దరు ఫ్రీ అవుతారు కాబట్టి కూల్ సెప్టెంబర్ లో లేదా అక్టోబర్ లో సినిమాను స్టార్ట్ చేయవచ్చని సమాచారం. ఇక సినిమా రిలీజ్ వచ్చే ఏడాది సమ్మర్ కు ఉండవచ్చని టాక్.
Needless to say, the mega-fans are looking forward to the first film Acharya, directed by Megastar Chiranjeevi Star Director Koratala Siva. There has already been a clarion call that the megastar will appear in a different role than ever before. Otherwise, the suspense of the release of the film is yet to go.
Story first published: Saturday, March 6, 2021, 17:48 [IST]