»   » అల్లు అర్జున్‌తో క్రిష్ ప్రయోగం.. టైటిల్ అదేనా!

అల్లు అర్జున్‌తో క్రిష్ ప్రయోగం.. టైటిల్ అదేనా!

Subscribe to Filmibeat Telugu

మంచి ప్రతిభ కలిగిన దర్శకుడు క్రిష్. ఆయన చిత్రాలు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఉంటాయి. క్రిష్ ప్రస్తుతం బాలీవుడ్ లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రధారిగా మణికర్ణిక చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. క్రిష్ తన తదుపరి చిత్రంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Bunny Vasu Given Clarity On Naa Peru Surya Rumours

అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మే మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, క్రిష్ తో సినిమా చేసే అవకాశలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తన్నాయి. అల్లు అర్జున్ గతంలో వేదం చిత్రం కోసం క్రిష్ దర్శకత్వంలో నటించారు. ఆ చిత్రానికి మంచి గుర్తింపు వచ్చినా కమర్షియల్ గా రాణించ లేకపోయింది.

Allu Arjun To team up with Krish

క్రిష్ ఇటీవలే అహం బ్రహ్మాస్మి అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారని, అది బన్నీ చిత్రం కోసమే అనే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రయోగాత్మకంగా తెరకెక్కించాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నారు. క్రిష్ చెప్పే స్టోరీకి బన్నీ ఒకే చెబితే ఈ కాంబినేషన్ సెట్ అయినట్లే. చూద్దాం ఏం జరుగుతుందో!

English summary
Allu Arjun To team up with Krish. Krish planning for experimental movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X