For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి సంచలన నిర్ణయం: ఆచార్య కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. షూటింగ్ పూర్తైనా అప్పటి వరకూ ఆగాల్సిందే

  |

  సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో పాటు ఆయనలోని గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారాయన. ఈ క్రమంలోనే ఆ వెంటనే 'సైరా: నరసింహారెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు.. ఆ వెంటనే 'ఆచార్య' అనే సినిమాను పట్టాలెక్కించేశారు. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమా కొత్త విడుదల తేదీ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  మెగా మల్టీస్టారర్‌గా వస్తున్న ‘ఆచార్య’

  మెగా మల్టీస్టారర్‌గా వస్తున్న ‘ఆచార్య’

  బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రమే ‘ఆచార్య'. ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అదే రీతిలో ఉన్నాయి.

  నేపథ్యం ఇదే.. ఇద్దరు హీరోలూ ఒకేలా

  నేపథ్యం ఇదే.. ఇద్దరు హీరోలూ ఒకేలా


  ‘ఆచార్య' సినిమాను దేవాదాయ భూముల ఆక్రమణలపై నక్సలైట్లు చేసే పోరాటం నేపథ్యంతో రూపొందిస్తున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నక్సలైట్లుగానే నటిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఇందులో చరణ్ పాత్ర 30 నిమిషాలు ఉండి చనిపోతుందని ప్రచారం జరుగుతోంది.

  ఇండియాలోనే అతిపెద్ద సెట్ ఏర్పాటు

  ఇండియాలోనే అతిపెద్ద సెట్ ఏర్పాటు

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘ఆచార్య' మూవీని ఖర్చుకు వెనకాడకుండా నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో టెంపుల్ టౌన్‌ సెట్‌ను కూడా నిర్మించారు. అలాగే, స్టార్ కాస్ట్‌ను కూడా తీసుకున్నారు. ఈ కారణంగానే ఈ మూవీ ప్రజల్లోకి వెళ్లింది. అందుకే ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

  టీజర్‌తో అంచనాలు.. భారీగా బిజినెస్

  టీజర్‌తో అంచనాలు.. భారీగా బిజినెస్

  చిరంజీవి సినిమా అంటే ఈలలు వేసేలా ఫైట్ సీన్స్.. పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్.. గ్రేస్‌తో కూడిన స్టైల్స్ ఆశిస్తుంటారు అభిమానులు. వాటన్నింటినీ దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య' టీజర్ వీడియోలో చూపించాడు. అందుకే ఇది వచ్చిన తర్వాత ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇది రికార్డు స్థాయి ధరలకు అమ్ముడు పోయినట్లు టాక్ వినిపిస్తోంది.

  కరోనాతో రిలీజ్ డేట్‌కు రాని ‘ఆచార్య’

  కరోనాతో రిలీజ్ డేట్‌కు రాని ‘ఆచార్య’


  ‘ఆచార్య' సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను ప్రారంభించి దగ్గర దగ్గర రెండేళ్లు కావొస్తుంది. అయితే, అప్పటి నుంచి మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురు కావడంతో సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. దీంతో ముందుగా ప్రకటించిన రిలీజ్ డేట్‌కు సినిమా విడుదల కాలేదు. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన కొత్త డేట్ ఎప్పుడు ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  రిలీజ్‌పై చిరంజీవి సంచలన నిర్ణయం

  రిలీజ్‌పై చిరంజీవి సంచలన నిర్ణయం


  ‘ఆచార్య' కొత్త రిలీజ్ డేట్ గురించి చాలా రోజులుగా ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే దసరాకి వస్తుందని కొందరు అంటుండగా.. దీపావళికి అని మరికొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ విడుదల తేదీపై మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇది వచ్చే సంక్రాంతికి రాబోతుందట.

  Kangana, Manoj Bajpayee, Dhanush Win at 67th National Film Awards
  ఆచార్య కొత్త రిలీజ్ డేట్.. ఆగాల్సిందే

  ఆచార్య కొత్త రిలీజ్ డేట్.. ఆగాల్సిందే


  ‘ఆచార్య'కు కేవలం 14 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అలాగే, డబ్బింగ్ సహా ఇతరత్రా కార్యక్రమాలతో నెల రోజుల్లో విడుదలకు సిద్ధం చేయొచ్చు. కానీ, ప్రస్తుతం పరిస్థితులు బాగోని కారణంగా.. వీలైనంత ఎక్కువ సమయం తీసుకోవాలని చిరంజీవి భావిస్తున్నారట. అందుకే అన్నీ పూర్తైనా.. సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లు తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

  English summary
  Megastar Chiranjeevi - Ram Charan Upcoming Film is Acharya. This movie directed by Koratala Siva. Latest News is That.. Acharya Release Postponed to Sankranthi 2022.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X