Don't Miss!
- News
ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం, కాశ్మీర్ పండిట్‌ను చంపిన ఉగ్రవాది కూడా
- Sports
బాబ్బాబు కాస్త వెస్టిండీస్ జట్టు తరఫున ఆడండని.. ప్లేయర్లను అడుక్కోవాలా ఏంటీ? కోచ్ ఫిల్ సిమన్స్ ఆవేదన
- Technology
ఈవెంట్ లో Samsung ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ అయింది ! ధర, ఫీచర్లు & సేల్ వివరాలు
- Finance
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థపై తాజా రిపోర్ట్.. మోర్గాన్ స్టాన్లీ అంచనాలు.. దశాబ్దకాలం..
- Automobiles
కొత్త 2022 ఎమ్‌జి హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ టీజర్ వెల్లడి.. అనేక కొత్త మార్పులతో వస్తున్న సరికొత్త హెక్టర్..
- Lifestyle
ఈ కూరగాయలు సహజంగా మీ రక్తంలో చక్కెరను తగ్గించగలవని మీకు తెలుసా?
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
Pushpa 2: విజయ్ సేతుపతి రావాల్సిందే.. అలాంటి పాత్ర కోసం ప్లాన్ చేస్తున్న సుకుమార్?
అల్లు అర్జున్ మొదటిసారి చేసిన పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందించింది. ఇక సెకండ్ పార్ట్ పుష్ప: ది రుల్ సినిమాను కూడా అంచనాలకు తగ్గట్టుగా భారీగా నిర్మించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే సెకండ్ పార్ట్ లో విజయ్ సేతుపతి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తారు అని చాలా రోజులుగా కథనాలు వెలువడుతున్నాయి. ఇక అతను ఏ పాత్రలో నటిస్తాడు అనే వివరాల్లోకి వెళితే..

అంచనాలు అస్సలు తగ్గలేదు
సుకుమార్ అల్లుఅర్జున్ కలయికలో ఇంతకుముందు ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చాయి. మొదటిది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన సినిమా మాత్రం దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఇక మూడవసారి వీరి కలయికలో సినిమా వస్తోంది అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. రెండోసారి డిజాస్టర్ అందుకున్నప్పటికీ కూడా ఈ కాంబినేషన్ పై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. తప్పకుండా ఏదో వండర్ క్రియేట్ చేసేలా ఉన్నారు అని ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేశారు.

ఎవరు ఊహించలేదు
పుష్ప మొదటి భాగం అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మొదటిసారి చేసిన పాన్ ఇండియా మూవీకి ఈ స్థాయిలో క్రేజ్ వస్తుంది అని ఎవరు ఊహించలేదు. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు హిందీలో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ పుష్ప సినిమాకు భారీ స్థాయిలో క్రేజ్ అయితే దక్కింది.

బడ్జెట్ ఎక్కువే..
ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2: ది రూల్ పై అంచనాలు అయితే మామూలుగా లేవు. అందుకోసమే దర్శక నిర్మాతలు చాలా ఆలోచించి ఈ సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారు. బడ్జెట్ కూడా ఈసారి 400 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో కూడా చాలా మార్పులు చేయబోతున్నట్లు సమాచారం.

ఫస్ట్ పార్ట్ లో విజయ్ సేతుపతి..
అయితే ఈ సినిమాలో మరొక ముఖ్యమైన పాత్ర కోసం విజయ్ సేతుపతి నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా కథనాలు అయితే వెలబడుతున్నాయి. అసలైతే ఫస్ట్ పార్ట్ కోసమే అతన్ని సంప్రదించారు. ఫాహద్ ఫాజీల్ చేసిన బాన్వర్ సింగ్ శికావత్ చేసిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం మొదట విజయ్ సేతుపతిని అనుకున్నప్పటికీ కూడా అతనికి సరైన డేట్స్ కుదరకపోవడంతో రిజెక్ట్ చేయాల్సి వచ్చింది.

సెకండ్ హాఫ్ లో సేతుపతి?
అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం మరోసారి విజయ్ సేతుపతిని సుకుమార్ ప్రత్యేకంగా కలిసినట్లు సమాచారం. ఒక క్యారెక్టర్ గురించి కూడా చెప్పడం జరిగిందట. భన్వర్ సింగ్ కంటే చాలా బలమైన పాత్ర అని తెలుస్తోంది. అల్లు అర్జున్ భన్వర్ సింగ్ ను చంపేయడంతో ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో మరొక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా విజయ్ సేతుపతి రంగంలోకి దిగుతాడట. మరి ఈ ట్విస్ట్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.