For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్టీఆర్ బాటలో ప్రభాస్.. చిన్న వయసులోనే ఎందుకిలా చేస్తున్నాడబ్బా.!

By Manoj Kumar P
|

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. అప్పటి నుంచి మన దేశంలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా అతడి పేరు మారుమ్రోగిపోయింది. అదే సమయంలో ప్రఖ్యాతి మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో అతడికి మరింత హైప్ వచ్చింది. ఇక, ఇటీవల వచ్చిన 'సాహో'తో మరోసారి ప్రభాస్ చర్చనీయాంశం అయిపోయాడు. ఈ సినిమా ఊహించినంత స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ప్రభాస్ తర్వాతి సినిమాపై దృష్టి సారించాడు. ఇందులో భాగంగానే త్వరలోనే తన తదుపరి చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాపై ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.?

 ‘సాహో' అంటూ ముందుకొచ్చాడు

‘సాహో' అంటూ ముందుకొచ్చాడు

తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల అయింది.

అందులో మాత్రం విఫలం

అందులో మాత్రం విఫలం

సాహోకు ప్రీమియర్ షోల సమయంలో మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత విడుదలైన రోజు రెండో ఆట నుంచి టాక్ మారిపోయింది. ఈ సినిమాను కొందరు బాగుందని అనగా, మరికొందరు మాత్రం బాలేదని అన్నారు. అయినప్పటికీ సాహో కలెక్షన్ల పరంగా దూసుకుపోయింది. అయితే, లాభాలను రాబట్టడంలో మాత్రం ఈ సినిమా విఫలమైందన్న టాక్ వినిపించింది.

జాన్ అంటూ వస్తున్నాడు

జాన్ అంటూ వస్తున్నాడు

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా న‌వంబ‌ర్ 18న నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్‌లో జరగనుంది. జాన్ అనే టైటిల్‌తో ప్ర‌చారం జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2020 చివ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించనుంది.

ఎన్టీఆర్‌ బాటలో ప్రభాస్

ఎన్టీఆర్‌ బాటలో ప్రభాస్

‘సాహో' వంటి భారీ సినిమా తర్వాత వస్తున్న ‘జాన్'లో ప్రభాస్ డుయల్ రోల్‌లో కనిపించనున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అది కూడా ఓ పాత్ర తండ్రిలా మరో పాత్రలో కొడుకులా కనిపించబోతున్నాడని అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ కూడా ‘ఆంధ్రావాలా' సినిమాలో ఇదే తరహా పాత్రను పోషించాడు. ఇప్పుడు అదే తరహా ప్రయోగాన్ని ప్రభాస్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది.

బాహుబలిలో కూడా అలానే

బాహుబలిలో కూడా అలానే

వాస్తవానికి ప్రభాస్ ద్విపాత్రభినయం చేయడం ఇది తొలిసారి కాదు. అతడు ‘బాహుబలి'లో కూడా తండ్రి, కొడుకుగా కనిపించాడు. అయితే, రెండు పాత్రలూ యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు చిత్రీకరించినవే. అయితే, జాన్‌లో మాత్రం తొంభైల నాటి వ్యక్తిగా ప్రభాస్ కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది.

చిన్న వయసులోనే ఎందుకిలా.?

చిన్న వయసులోనే ఎందుకిలా.?

ప్రభాస్ తండ్రి పాత్రను చేస్తాడని వార్త బయటకు రాగానే కొన్ని విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ‘సింహాద్రి' వంటి బంపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా' చేశాడు. అందులోనూ తండ్రిగా కనిపించాడు. దీంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. చిన్న వయసులో అలాంటి పాత్ర చేయడం చాలా మందికి నచ్చలేదు కూడా. ఇప్పుడు ప్రభాస్ కూడా అలాగే చేస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

English summary
After Saaho, Prabhas is now concentrating on his upcoming film titled Jaan. The romantic love story starring Pooja Hegde is being helmed by Radha Krishna. It is said that he has already shot for 20 days and is expected to resume the shoot in the coming weeks.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more