Just In
Don't Miss!
- News
ఇండియాకు 10 మిలియన్ కరోనా వ్యాక్సిన్ డోసులను ఫ్రీగా ఇవ్వనున్న సీరమ్ ఇనిస్టిట్యూట్
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్‌కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మెగాస్టార్ లేకుండానే మరో సినిమా షూటింగ్.. కామెడీలొద్దని కొత్త ప్రాజెక్ట్ క్యాన్సిల్
మెగాస్టార్ చిరంజీవి మంచి ఉపుమీదున్న సమయంలో కరోనా దెబ్బకు బ్రేకులు వేయక తప్పలేదు. సైరా అనంతరం వీలైనంత వరకు నెక్స్ట్ ఐదేళ్లు సినిమాలతోనే బిజీగా ఉండాలని అనుకున్నారు మెగాస్టార్. కానీ అనుకోకుండా ఏర్పడిన ఈ మహమ్మారి ఆయనను స్లో అయ్యేలా చేసింది. ఇక పరిస్థితులు ఎన్ని రోజులు ఇలా ఉంటాయో తెలియదు గాని మెగాస్టార్ మాత్రం షూటింగ్స్ మొదలు పెడితే బ్రేక్ లేకుండా ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ షాకింగ్ నిర్ణయాలు
అయితే మెగాస్టార్ తన కెరీర్ లో నెవర్ బిఫోర్ అనేలా చేస్తున్న రిస్కులు మాత్రం మామూలుగా లేవు. తొందరపడి మాట ఇస్తున్నారా లేక అన్ని తెలిసే దర్శకులను నమ్ముతున్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే మెగాస్టార్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక సినిమాతో రాబోతున్నారు. ఈ ప్రాజెక్టుపై సస్పెన్స్ మెయింటైన్ చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజున క్లారిటీ ఇచ్చేశాడు.

మెగాస్టార్ లేకుండానే షూటింగ్
అసలు మ్యాటర్ వస్తే మెగాస్టార్ ఇటీవల కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మెహర్ రామేష్ కంటే ముందే బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకున్న చిరు ఇప్పుడు ఆలోచన మార్చుకున్నట్లు టాక్ వస్తోంది. మెహర్ రమేష్ ను షూటింగ్ మొదలు పెట్టాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తన ఇన్వాల్వ్ మెంట్ లేని సీన్స్ తోనే షూటింగ్ స్టార్ట్ చేయాల్సిందిగా ఆర్డర్ వేషారట.

కన్ఫ్యూజన్ లో పడిన బాబీ
ఇక బాబీ దర్శకత్వంలో చేయనున్న సినిమా విషయంలో మెగాస్టార్ వెనక్కి తగ్గినట్లు టాక్ వస్తోంది. కామెడీ జనర్ లో మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా బాబీ ఒక కథను సెట్ చేసుకోగా అంతగా నచ్చలేదట. దీంతో కామెడీ కాకుండా కొత్త స్టైల్ లో యాక్షన్ ప్లస్ ఎమోషన్స్ తో కూడిన సబ్జెక్ట్ సెట్ చేసుకోమ్మని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇన్ని రోజులు లాక్ డౌన్ లో కష్టపడి రాసుకున్న బాబీ సడన్ గా మెగాస్టార్ ఆలోచన తీరు మారడంటగో కన్ఫ్యూజన్ లో పడ్డట్లు టాక్.

వినాయక్ తో సినిమా లేనట్లేనా..?
ఇక ఈ ఇద్దరితో పాటు వినాయక్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాలని అనుకున్నాడు మెగాస్టార్. లూసిఫర్ ని తెలుగులో రీమేక్ చేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు చరణ్. అయితే మొదట సుజిత్ ని సెట్ చేసుకోగా అతను మధ్యలోనే డ్రాప్ అయ్యాడు. ఇక వినాయక్ ఇప్పుడు బెల్లకొండతో బాలీవుడ్ ఛత్రపతి కోసం రెడీ అవుతున్నాడు. మరి లూసిఫర్ రీమేక్ విషయంలో మరోసారి ఏమైనా ఆలోచిస్తారా లేక వినాయక్ వచ్చే వరకు వెయిట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.