For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ భామల మీద నాగ్ ఫోకస్.. ఎవరినీ వదలకుండా!

  |

  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఊపిరి సినిమా తర్వాత నాగార్జున కు సరైన హిట్ పడలేదు.. ఈ ఏడాది వైల్డ్ డాగ్ సినిమాతో మళ్లీ ఆయన హిట్ అందుకున్నాడు. ఇక నాగార్జున ప్రస్తుతం రెండు సినిమాలు లైన్ లో పెట్టారు. ఇవి కాక ఒక తమిళ సినిమా అలాగే ఒక హిందీ సినిమాలో కూడా కీలక పాత్రలలో ఆయన నటిస్తున్నారు. తెలుగులో చేస్తున్న రెండు సినిమాల విషయానికి వస్తే ఒక సినిమా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తూ ఉండగా మరొకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్నారు. అయితే నిజానికి నాగార్జున తన కెరీర్ మొదటి నుంచి కూడా ఎక్కువగా కొత్త ముఖాలతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా నాగార్జున అదే పద్ధతి ఫాలో అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన ఏకంగా ముగ్గురు బిగ్ బాస్ భామలకి వరుస ఆఫర్లు ఇచ్చారని అంటున్నారు.

  వారు ఎవరు అని ఆశ్చర్యపోతున్నారా? మాజీ బిగ్ బాస్ పోటీదారులు - అరియానా గ్లోరీ, దివి వధ్య, మరియు మోనాల్ గజ్జర్‌లకు నాగార్జున ఆఫర్లు ఇచ్చారని అంటున్నారు. ఈ ముగ్గురు బిగ్ బాస్ షో తర్వాత చాలా బిజీగా మారారు. పాపులర్ కూడా మారారు. ఇక నాగార్జున వారి కెరీర్‌ని మరింత పరుగులు పెట్టించడానికి ఆఫర్‌లను ఇస్తూ వారిని ప్రోత్సహించాలని ఫిక్స్ అవుతున్నారని అంటున్నారు. ఇక మోనాల్ గజ్జర్ ఇటీవల సోగ్గాడే చిన్ని నాయన ప్రీక్వెల్ బంగార్రాజులో నటించారని అంటున్నారు. ఆమె స్పెషల్ సాంగ్ చేస్తోందా లేదా సినిమాలో ఏదైనా చిన్న అతిధి పాత్ర చేస్తుందా అనే విషయం మాత్రం గోప్యంగా ఉంచబడింది. అయితే నాగార్జున సినిమాలో అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. మరో వైపు, దివి ఇప్పటికే ఒక మీడియం-బడ్జెట్ సినిమాలో ఒక లీడ్ రోల్ లో హీరోయిన్ గా నటించారని అంటున్నారు.

  Nagarjuna gave offers To Three Bigg Boss girls

  ఇక ఈ సినిమాని నాగార్జున బంగార్రాజు సినిమాకి దర్శకత్వం వహిస్తున్న కల్యాణ్ కృష్ణ నిర్మించారని అంటున్నారు. ఇక మరో పక్క యాంకర్ అరియానా నాగార్జున బ్యానర్‌పై నిర్మించిన రాజ్ తరుణ్ చిత్రంలో కనిపించనున్నారని అంటున్నారు. అయితే నాగార్జున వారికి ఆఫర్లు ఇచ్చినప్పటికీ, ఈ ముగ్గురు సినిమా అవకాశాన్ని ఏమేరకు అందుకుంటారు అనేది వేచి చూడాలి మరి. ఇక మరో పక్క బిగ్ బాస్ నాలుగో సీజన్ ముగిసి ఇన్ని రోజులు అవుతున్నా కూడా కంటెస్టెంట్ల హడావిడి తగ్గడం లేదు. కరోనాతో వచ్చిన గ్యాప్ వల్ల ఐదో సీజన్ ఇంకా మొదలవ్వలేదు. ప్రతి ఏడాది కంటే కాస్త ఆలస్యంగా మొదలుకాబోతోన్న ఈ ఐదో సీజన్ ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక కొద్ది రోజులు క్రితం ఐదో సీజన్ లోగోను కూడా స్టార్ మా విడుదల చేసింది. ఇక ఈ షోకు గత సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే లీకు వీరులు కంటెస్టెంట్ల లిస్ట్‌లో కొత్త కొత్త పేర్లను చేర్చుతూ లీకులు వదులుతున్నారు.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Even the little things about movie celebrities in general are interesting to the common man. Similarly, a police case has been registered against mega daughter Niharika's husband Jonnalagadda Chaitanya, who recently got married. finally Jonnalagadda Chaitanya opened his mouth on the subject, going into the details of it.Nagarjuna has been mostly interested in working with new faces since the beginning of his career. Even now Nagarjuna says it is possible that the same method will be followed. as per reports he gave of offers to three Bigg Boss beauties simultaneously.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X